సీనియర్లకు నో ఛాన్స్.. ఐపీఎల్ హీరో వైభవ్‌కు బంపర్ ఆఫర్!
జపాన్‌లోని ఐచీ-నాగోయా వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్‌లలో జరగనున్న ఆసియా క్రీడలు 2026 కోసం బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిష్టాత్మక క్రీడల కోసం 30 మంది సభ్యులతో కూడా ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ భారత ఒలింపిక్ సంఘానికి సమర్పించింది. అయితే ఈ జాబితాలో ప్రస్తుత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వన్డే-టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌లకు చోటు దక్కకపోవడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా ఇటీవలే ఐపీఎల్ 2026లో తన మెరుపు బ్యాటింగ్‌తో దేశాన్ని ఆకర్షించిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ తొలిసారిగా ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం.
నిజానికి సెప్టెంబర్-అక్టోబర్ కాలంలో టీమిండియా వెస్టిండీస్ పర్యటన, ఏషియన్ గేమ్స్ క్రికెట్ టోర్నమెంట్ దాదాపు ఒకే సమయంలో జరగనున్నాయి. వెస్టిండీస్‌తో భారత్ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 17 వరకు మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడాల్సి ఉంది. మరోవైపు ఏషియన్ గేమ్స్ పురుషుల క్రికెట్ టోర్నీ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు జరుగుతుంది. ఈ నేపథ్యంలో సెలెక్టర్లు ఒకే సమయంలో రెండు వేర్వేరు బలమైన టీ20 జట్లను సిద్ధం చేయాల్సి వస్తోంది.

భవిష్యత్తులో శుభ్‌మన్ గిల్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నందున, వెస్టిండీస్ సిరీస్ దృష్ట్యా అతడిని ఆసియా క్రీడల జాబితాలో చేర్చలేదు. అయితే సూర్యకుమార్ యాదవ్‌ను పక్కన పెట్టడం వెనుక భిన్నమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. 2028 ఒలింపిక్స్, తదుపరి టీ20 వరల్డ్ కప్‌నకు సంబంధించిన బీసీసీఐ దీర్ఘకాలిక ప్రణాళికల్లో సూర్యకుమార్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదు. అందుకే సూర్యకుమార్ యాదవ్ పేరును ఆ ఆటగాళ్ల జాబితాలో చేర్చలేదు.
ఆసియా క్రీడల జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే రేసులో శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, తిలక్ వర్మల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రా పేరు ఈ 30 మంది లిస్ట్‌లో ఉన్నప్పటికీ.. 2027 వన్డే వరల్డ్ కప్ సన్నాహాల దృష్ట్యా ఆ సమయంలో బుమ్రా వన్డే క్రికెట్‌కే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అలాగే గాయం నుంచి కోలుకుంటున్న హర్షిత్ రాణా కూడా ఫిట్‌నెస్ సాధిస్తాడనే నమ్మకంతో ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఇక స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబేలను ఎంపిక చేశారు. అయితే వీరిలో ఇద్దరు మాత్రమే ఆసియా క్రీడల జట్టులో ఉంటారని, మిగిలిన వారు వెస్టిండీస్ పర్యటనకు వెళ్తారని సమాచారం. గత హాంగ్‌జౌ ఏషియన్ క్రీడల్లో భారత్‌కు పసిడి పతకం అందించిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు, ఇటీవలి ఫామ్ అంతగా లేకపోయినా ఈ జాబితాలో చోటు కల్పించారు.
ఆసియా క్రీడల కోసం బీసీసీఐ ప్రకటించిన 30 మంది ఆటగాళ్ల జాబితా ఇదే(అంచనా జట్టు):
యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, తిలక్ వర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, ఆయుష్ బదోని, హర్ష్ దూబే, ధ్రువ్ జురేల్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, షాబాజ్ అహ్మద్, శివం దూబే, విప్రరాజ్ నిగమ్, హర్షిత్ రాణా, యశ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications