Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games 2023: చిత్తుగా ఓడిన ఆసియా క్రీడల టీం.. ఇలాగైతే ఒక మెడల్ ఏం తెస్తారు?

ఆసియా గేమ్స్‌లో కచ్చితంగా మెడల్ సాధిస్తామని నమ్మకంగా ఉన్న క్రికెట్ జట్టు బోల్తా కొట్టింది. చైనా బయలు దేరడానికి ముందు కర్ణాటకతో ఆడిన వార్మప్ మ్యాచులో తేలిపోయింది. ఆలూర్ గ్రౌండ్స్‌లో శుక్రవారం నాడు కర్ణాటక టీంతో ఆసియా క్రీడలకు వెళ్లే భారత జట్టు వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ ఆసాంతం కర్ణాటక టీం ఆధిపత్యం చెలాయించింది.

ఆసియా గేమ్స్‌కు (Asian Games 2023) వెళ్లే టీం ముందుగా బ్యాటింగ్ చేయగా కర్ణాటక బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో ఆ జట్టు కేవలం 133 పరుగులకే కుప్పకూలింది. టీం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్ ఆడలేదు. అతను ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీసులో ఆడుతున్న సంగతి తెలిసిందే. మొదటి వన్డేలో రుతురాజ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

Asian Games 2023 ఇలాగైతే ఒక మెడల్ ఏం తెస్తారు?

మిగతా టీం అంతా ఈ వార్మప్ మ్యాచ్ ఆడింది. కర్ణాటక బౌలర్లు చాలా టైట్ బౌలింగ్ వేయడంతో ఆసియా గేమ్స్‌కు (Asian Games 2023) వెళ్లే టీం ఏమాత్రం భారీ షాట్లు ఆడలేకపోయింది. కర్ణాటక బౌలర్లలో వి కౌశిక్ (3/36), మనోజ్ భండగే (4/15), శుభంగ్ హెగ్డే (3/17) చెలరేగారు. ఇక స్వల్ప లక్ష్య ఛేదనలో కర్ణాటక బ్యాటర్లు కూడా ఆకట్టుకున్నారు. వెటరన్ ప్లేయర్ మనీష్ పాండే పట్టుదలగా ఆడాడు.

ఆసియా గేమ్స్ టీంలో యశస్వి జైస్వాల్ (31) తనకు దక్కిన ఆరంభాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (49) హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. వీళ్లిద్దరూ మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేదు. కర్ణాటక సీనియర్ బ్యాటర్ మనీష్ పాండే (52 నాటౌట్) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆ టీం కేవలం 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఆసియా గేమ్స్ (Asian Games 2023) టీంను చిత్తుచేసింది.

ఇది తెలిసిన ఫ్యాన్స్ నోరెళ్లబెడుతున్నారు. మంచి కుర్ర స్టార్లు ఉన్న టీం ఇంత చెత్తగా ఆడితే ఆసియా గేమ్స్‌లో ఇక మెడల్ ఏమొస్తుందని ప్రశ్నిస్తున్నారు. తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్ ఈ టీంలో లేని మాట నిజమే. కానీ వాళ్లిద్దరూ లేకపోతే మరీ ఇంత దారుణంగా ఆడతారా? అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ టీం చైనా (Asian Games 2023) బయలుదేరనున్న సంగతి తెలిసిందే.

Story first published: Saturday, September 23, 2023, 11:04 [IST]
Other articles published on Sep 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+