Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia games 2023: క్రికెట్లో బంగారం పట్టేసిన టీమిండియా.. తొలి ప్రయత్నంలోనే స్వర్ణం కైవసం!

ఆసియా గేమ్స్ 2023లో భారత్ బంగారు పతకం గెలుచుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో టోర్నీ నిర్వాహకులు భారత్‌ను విజేతగా నిర్ణయించారు. దీంతో టీమిండియా పసిడి పతకంతో మెరవగా.. ఆఫ్ఘనిస్తాన్ కాంస్యం సొంతం చేసుకుంది.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం కారణంగా మ్యాచ్ 20 నిముషాలు ఆలస్యంగా మొదలైంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై ఆడిన జట్టుతోనే కెప్టెన్ రుతురాజ్ గౌక్వాడ్ ఫైనల్లో కూడా బరిలోకి దిగాడు.

 Asia games 2023

మొదట టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోవడంతో ఆఫ్ఘన్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే భారత బౌలర్ల ధాటికి ఆఫ్ఘన్ ఓపెనర్లు జుబైద్ అక్బారీ(5), మహమ్మద్ షహజాద్(4) లతో పాటు నూల్ అలీ జద్రాన్(1), అఫ్జర్ జజాయ్(15), కరీం జానత్(1) అలా వచ్చి ఇలా పెవిలియన్ చేరారు.

అయితే షహాదుల్లా(49)తో పాటు గుల్బదిన్ నయీబ్(27) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. అయితే 18.2 ఓవర్లు వద్ద మళ్లీ వర్షం మొదలు కావడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపేశారు. అప్పటికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 5 వికెట్ల నష్టానికి 112 రన్స్ చేసింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, శివమ్ దూబె, షహబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్‌లు తలా ఓ వికెట్ తీశారు.

ఇదిలా ఉంటే వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్ అధికారులు పోటీని రద్దు చేసి భారత్‌ను విజేతగా ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్ రన్నరప్‌గా నిలవడంతో ఆ జట్టుకు రజత పతకం లభించింది.

మరోపక్క కాంస్య పతకం కోసం జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్‌లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించినా చివరికి 5 ఓవర్ల మ్యాచ్ జరిగింది.

మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 48 రన్స్ చేయగా.. మ్యాచ్ నిర్వాహకులు బంగ్లాదేశ్‌కు 65 రన్స్ టార్గెట్ సెట్ చేశారు. అయితే 65 రన్స్ టార్గెట్‌ను 4 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి ఛేజ్ చేసిన బంగ్లాదేశ్.. కాంస్యం పతకాన్ని పట్టేసింది.

Story first published: Saturday, October 7, 2023, 15:42 [IST]
Other articles published on Oct 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+