Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎమెర్జింగ్ నేషన్స్ కప్: పీసీబికి మరో షాక్ ఇచ్చిన బీసీసీఐ

Asian Emerging Nations Cup: Pakistan to host six matches, India to play in Sri Lanka

న్యూ ఢిల్లీ: కొద్ది రోజుల ముందు మ్యాచ్‌లు ఆడతామంటూ టీమిండియా మాటిచ్చి తమకు అన్యాయం చేసిందని బీసీసీఐ పాలకుల కమిటీపై ఫిర్యాదు చేసింది . దీంతో పీసీబీ వాదనను కొట్టేసిన ఐసీసీ.. బీసీసీఐకి అనుకూలంగానే తీర్పునిచ్చింది. ఇప్పుడు దాంతో పాటుగా పీసీబీ ఆతిథ్యాన్ని తిరస్కరిస్తూ బీసీసీఐ మరో షాక్‌కు గురి చేసింది. ఈ నిర్ణయాన్నికి బీసీసీఐ ప్రత్యేక ఆతిథ్యం మేర శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడనుంది.

 ఆటగాళ్లను పంపలేమని బీసీసీఐ

ఆటగాళ్లను పంపలేమని బీసీసీఐ

పీసీబీ, శ్రీలంక, బీసీసీఐ ఆసియా దేశాల క్రికెట్ జట్లు పాల్గొనే ఆసియా ఎమర్జింగ్ నేషన్స్ కప్‌‌కు ఈ ఏడాది పాకిస్థాన్ ఆతిథ్యమిస్తోంది. మొత్తం 8 దేశాలు పాల్గొనే ఈ టోర్నీలో టీమిండియా కూడా పాల్గొంటోంది. అయితే పాకిస్థాన్‌లో మ్యాచ్‌లను నిర్వహిస్తే తాము ఆడబోమని పీసీబీకి బీసీసీఐ స్పష్టం చేసింది. పాకిస్థాన్‌లో భద్రతా కారణాల దృష్ట్యా తమ ఆటగాళ్లను కరాచీకి పంపలేమని బీసీసీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో భారత్ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించనున్నట్లు పీసీబీ తాజాగా ప్రకటించింది.

ఆతిథ్యాన్ని పంచుకోనున్న పాకిస్థాన్, శ్రీలంకలు

ఆతిథ్యాన్ని పంచుకోనున్న పాకిస్థాన్, శ్రీలంకలు

ఈ మేరకు ఓ పీసీబీ అధికారి మీడియాకు వెల్లడించారు. దీంతో ఈ సిరీస్‌ ఆతిథ్యాన్ని పాకిస్థాన్, శ్రీలంక దేశాలు పంచుకున్నాయి. డిసెంబర్‌లో ప్రారంభంకానున్న ఈ టోర్నీలో బంగ్లాదేశ్, యూఏఈ, హాంకాంగ్, పాకిస్థాన్ పాల్గొనే గ్రూప్ మ్యాచ్‌లు కరాచీలో జరుగుతాయి. ఇక శ్రీలంక, ఇండియా, అఫ్ఘానిస్తాన్ పాల్గొనే మరో గ్రూప్ మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి. ఫైనల్ కూడా కొలంబొలోనే జరగనుంది.

అంతకుముందు ఇవే కారణాలతో:

అంతకుముందు ఇవే కారణాలతో:

కరాచీలో రెండు స్టేడియాలలో మ్యాచ్‌లు జరుగుతాయని పీసీబీ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం పునరుద్ధరణ పనులు జరుగుతోన్న నేషనల్ స్టేడియంలో 3 మ్యాచ్‌లు, సౌతెండ్ క్రికెట్ స్టేడియంలో మరో మూడు మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. డిసెంబర్ 4 నుంచి 10 వరకు ఈ మ్యాచ్‌లు జరుగుతాయన్నారు. ఇదిలా ఉంటే, గత ఆసియా కప్ టోర్నమెంట్‌లో సైతం పాకిస్థాన్‌లో ఆడేందుకు బీసీసీఐ నిరాకరించింది.

పాక్ అంగీకరించింది.. మేం కాదు

పాక్ అంగీకరించింది.. మేం కాదు

యూఏఈలోని స్టేడియంలలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లు నిర్వహించారు. అయితే ఈసారి మాత్రం పాకిస్థాన్ తమ దేశంలో మ్యాచ్‌లను నిర్వహించాలని నిర్ణయించింది. కానీ భారత్ అంగీకరించలేదు. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్.. శ్రీలంకను మరో వేదికగా నిర్ణయించింది. కాగా, ఈ సిరీస్‌లో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక తరఫున అండర్ 23 జట్లు పాల్గొంటాయి. మిగిలిన దేశాల ప్రధాన జట్లు పోటీపడతాయి. కిందటేడాది ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌లో నిర్వహించారు. ఈ టోర్నీలో శ్రీలంక విజేతగా నిలిచింది.

Story first published: Wednesday, November 28, 2018, 15:18 [IST]
Other articles published on Nov 28, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+