ఆసియా కప్: పాక్‌తో మ్యాచ్, అతడు భారత జట్టుకు ప్రమాదం

హైదరాబాద్: యూఏఈ వేదికగా శనివారం నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ టోర్నీలో పాకిస్థాన్ సీనియర్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్‌తో భారత జట్టుకు ప్రమాదమేనని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ హెచ్చరించాడు. షోయబ్ మాలిక్ క్రీజులో పాతుకుపోతే పాక్ భారీ స్కోరు సాధించే అవకాశం ఉందని అన్నాడు.
తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్యూలో వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ "దుబాయ్ పిచ్‌లు అతడి బ్యాటింగ్ శైలికి అనుగుణంగా ఉంటాయి. మంచి ఆరంభం లభిస్తే కట్టడి చేయడం అసాధ్యం. అంతేకాదు భారత్‌పై అతడికి అద్భుతమైన రికార్డు ఉంది. మిడిల్ ఓవర్లలో భారత్ స్పిన్నర్లతో బౌలింగ్ చేస్తుంది" అని అన్నాడు.

అతడు గొప్ప ఆటగాడు
"స్పిన్ బౌలింగ్‌లో ఆడటంలో అతడు గొప్ప ఆటగాడు. ప్రస్తుతం భారత జట్టులో ఇద్దరు నాణ్యమైన మణికట్టు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. ఓపెనర్‌గా ఫకార్ జమాన్, మూడో స్థానంలో బరిలో దిగే బాబర్ అజామ్‌పైనే పాక్ ఎక్కువగా ఆధారపడుతోంది. షోయబ్ మాలిక్ పాక్ బ్యాటింగ్ లైనప్‌లో ప్రధాన ఆయుధం" అని లక్ష్మణ్ తెలిపాడు.

పరిమిత ఓవర్ల క్రికెట్లో అపారమైన అనుభవం
"స్ట్రయిక్ రొటేట్ చేస్తూ సింగిల్స్ తీయడమే కాకుండా.. అలవోకగా బంతులను బౌండరీలను తరలిస్తాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అపారమైన అనుభవం ఉందని, అతనొక ఛాంపియన్" అని లక్ష్మణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. టోర్నీలో భాగంగా రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.
దుబాయి వేదికగా సెప్టెంబర్ 19న భారత్-పాక్ మ్యాచ్
తొలి మ్యాచ్‌లో క్వాలిఫయిర్‌తో తలపడనున్నా టీమిండియా, ఆ తర్వాత చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో దుబాయి వేదికగా సెప్టెంబర్ 19న తలపడనుంది. శనివారం నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్, హాంకాంగ్ జట్లు కూడా రెండు గ్రూపులుగా విడిపోయి టోర్నీలో తలపడనున్నాయి.

గ్రూప్-ఏలో భారత్-పాకిస్థాన్
గ్రూప్-ఏలో ఇండియా, పాకిస్థాన్, హాంకాంగ్ ఉండగా... గ్రూప్-బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి. సెప్టెంబర్ 15(శనివారం) టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్-శ్రీలంక జట్లు తలపడనున్నాయి. టోర్నీలో చివరి మ్యాచ్ సెప్టెంబర్ 28న జరగనుంది. గత ఆసియా కప్ టోర్నమెంట్‌కు బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications