మిర్పూర్: ఏ మైదానమైనా.. ఏ బౌలర్ అయినా.. తన బ్యాటింగ్ శైలిలో మార్పు చూపని ఆటగాడు విరాట్ కోహ్లీ అని వేరే చెప్పక్కర్లేదు. ఇటీవలి కాలంలో సూపర్ ఫాంలో కొనసాగుతున్న కోహ్లీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు.
ఆసియా కప్ టీ20 టోర్నమెంటులో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచులో 5 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లోని మిర్పూర్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ విజయంలో కోహ్లీ కీలక ఇన్నింగ్ ఆడి భారత్‌కు విజయాన్నందించాడు.
టోర్నీలో వరుసగా మూడు విజయాలు సాధించిన టీమిండియా మార్చి 6న జరిగే ఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం జరిగిన మ్యాచులో అర్ధ శతకం బాదిన కోహ్లీ.. అంతర్జాతీయ టీ20లో 13వ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 36 మ్యాచుల్లో ఇతనికిది 34వ ఇన్నింగ్స్. 56 పరుగులతో రాణించిన కోహ్లీ బ్యాటింగ్ సగటు 51ప్లస్‌గా నమోదైంది. 500 పరుగులు చేసిన ఆటగాళ్లతో పోల్చితే ఇదే అత్యుత్తమం.

కాగా, పాకిస్థాన్, శ్రీలంక జట్లతో ఆడిన మ్యాచుల్లో ఎక్కువ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు తీసుకున్న ఆటగాళ్లలో యువరాజ్ సింగ్ పేరుతో ఉన్న రికార్డును కోహ్లీ సమం చేశాడు.
కోహ్లీ, యువరాజ్‌లు చెరో ఏడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచులు గెలుచుకున్నారు. అయితే, యువీ కంటే తక్కువ మ్యాచుల్లోనే కోహ్లీ ఈ ఘనత సాధించాడు. 49 మ్యాచులాడిన యువీ 7 ట్రోఫీలను సాధిస్తే.. కోహ్లీ మాత్రం 36 మ్యాచుల్లోనే సాధించాడు.
టీ20 అంతర్జాతీయ మ్యాచుల్లో ఎక్కువ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌లు గెలుచుకున్న భారత ఆటగాడిగా కోహ్లీ పేరిట రికార్డు ఉంది. ఆ తర్వాత యువరాజ్, రవిచంద్రన్ అశ్విన్‌లు చెరో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు సాధించారు.
అంతర్జాతీయ టీ20లో ఎక్కువ మ్యాన్ ఆఫ్ ది మ్యాచులు గెలుచుకున్న టాప్-3 భాతర ఆటగాళ్లు:
7-విరాట్ కోహ్లీ(36మ్యాచులు), యువరాజ్ సింగ్(49)
3-ఆర్ అశ్విన్(37), రోహిత్ శర్మ(53)
2-అమిత్ మిశ్రా(7), ఇర్ఫాన్ పఠాన్(24), యూసుఫ్ పఠాన్(22), సురేష్ రైనా(55).