For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్: లంకను చితక్కొట్టి ఫైనల్‌కు భారత్

By Pratap

మిర్పూర్‌: ట్వంటీ20 ఆసియా కప్ పోటీల్లో భారత్ అప్రతిహతంగా దూసుకుపోతోంది. టోర్నీలో వరుసగా మూడో విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మంగళవారం జరిగిన తమ మూడో లీగ్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ శ్రీలంకపై ఐదు వికెట్లతో టీమిండియా ఘన విజయం సాధించింది.

శ్రీలంక నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఐదు వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఆరంభంలోనే ఓపెనర్లు శిఖర్‌ ధవన్‌ (1), రోహిత శర్మ (15) వికెట్లు కోల్పోవడంతో కాస్తా చిక్కుల్లో పడినా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ (47 బంతుల్లో 7 ఫోర్లతో 56 నాటౌట్‌) మరో మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడి జట్టుకు విజయం కట్టబెట్టాడు.

Photos: Asia Cup T20 2016

రీ ఎంట్రీలో ఇప్పటిదాకా పెద్దగా ప్రభావం చూపని వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ యువరాజ్‌ (18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 35) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగాడు. లంక బౌలర్లలో నువాన్‌ కులశేఖర రెండు వికెట్లు తీశాడు.

Asia Cup T20: India beat Sri Lanka to enter final

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 138 పరుగులు చేసింది. కపుగెదెర (30), సిరివర్దన (22) మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. కెప్టెన్‌ ఏంజెలో మాథ్యూస్‌ (18), దిల్షాన్‌ (18) జట్టును ఆదుకోలేకపోయారు. చివర్లో తిషార పెరెరా (6 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 17) మెరుపులు మెరిపించాడు.

భారత బౌలర్లలో జస్‌ప్రీత బుమ్రా, హార్దిక్‌ పాండ్యా, అశ్విన్‌ తలో రెండు వికెట్లు తీసి లంకను కట్టడి చేశారు. విరాట్‌ కోహ్లీ 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'గా నిలిచాడు. ఈ విజయంతో మొత్తం ఆరు పాయింట్లతో భారత ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగే తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో యూఏఈతో టీమిండియా పోటీ పడనుంది.

లక్ష్య ఛేదనకు దిగిన ఓపెనర్లను వరుస ఓవర్లలో అవుట్‌ చేసిన కులశేఖర భారతను దెబ్బ కొట్టాడు. శిఖర్ ధావన్ కులశేఖర వేసిన గుడ్‌లెంగ్త్‌ బంతిని కవర్స్‌ దిశగా పుష్‌ చేయబోగా అది ఎడ్జ్‌ తీసుకొని కీపర్‌ చేతిలో పడింది. మూడు ఫోర్లు కొట్టి జోరు మీదున్న రోహిత్ స్లిప్‌లో కపుగెదెరకు చిక్కాడు.

Asia Cup T20: India beat Sri Lanka to enter final

అయితే వన్‌డౌన్‌లో వచ్చిన కోహ్లీ, రైనాతో కలిసి స్కోరుబోర్డును నడిపించాడు. కోహ్లీ సులభంగా బౌండ్రీలు రాబట్టగా, రైనా స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ అతనికి సహకరించాడు. అయితే అప్పటిదాకా కూల్‌గా ఆడిన రైనా షనక బౌలింగ్‌లో భారీషాట్‌ ఆడబోయి కులశేఖరకు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో మూడో వికెట్‌కు వీరిద్దరి 54 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

రైనా నిష్క్రమణతో క్రీజులోకొచ్చిన సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ యువరాజ్‌ చాలా రోజుల తర్వాత దూకుడు ప్రదర్సించాడు. తానెదుర్కొన్న రెండో బంతినే బౌండ్రీకి పంపిన యువీ హెరాత్ వేసిన 13వ ఓవర్‌ చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. పెరెర బౌలింగ్‌లోనూ భారీ సిక్సర్‌ బాదాడు. అయితే పెరెర వేసిన 17వ ఓవర్లో బౌండ్రీ కొట్టిన యువీ తర్వాతి బంతికే హుక్‌ షాట్‌ ఆడి ఫైన్‌లెగ్‌లో కులశేఖరకు చిక్కాడు.

తర్వాతి ఓవర్లోనే హార్దిక్‌ పాండ్యా (2)ను హెరాత బౌల్డ్‌ చేశాడు. చివరి రెండు ఓవర్లలో జట్టు విజయానికి 14 పరుగులు అవసరమ్యాయి. సిరివర్దన బౌలింగ్‌లో ధోనీ (7 నాటౌట్‌) బౌలర్‌ తలమీదుగా సిక్సర్‌ రాబట్టగా, ఐదో బంతిని బౌండ్రీకి తరలించిన కోహ్లీ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఇక చివరి ఓవర్‌ రెండో బంతికి మరో బౌండ్రీతో విరాట్‌ ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు.

Asia Cup T20: India beat Sri Lanka to enter final

ధోనీ కీపింగ్‌ భళా
బ్యాట్స్‌మన్‌గా మునుపటిలా రాణించలేకపోతున్న కెప్టెన్‌ ధోనీ కీపింగ్‌లో మాత్రం అదరగొడుతున్నాడు. వికెట్ల వెనుకాల చురుగ్గా కదులుతూ ప్రత్యర్థులను దెబ్బ కొడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు పట్టిన ధోనీ, ఒక రనౌట్‌, స్టంపౌట్‌ చేసి నాలుగు వికెట్లలో భాగస్వామి అయ్యా డు.

ప్రధానంగా చివర్లో భారీ షాట్లు కొడుతున్న పెరెరాను మహీ స్టంపౌట్‌ చేసిన తీరు మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. 19వ ఓవర్లో అశ్విన్‌ వైడ్‌ బంతికి పెరెరా క్రీజు వదిలి ముందుకెళ్లి ఆడబోగా, మహీ రెప్పపాటులో వికెట్లను కూల్చాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+