For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫినిష్ చేసిన ధోనీ: భారీ గెలుపు, ఆసియా కప్ భారత్‌దే

By Pratap

మిర్పూర్: ట్వంటీ20 ఆసియా కప్‌ను భారత్ సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచులో ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టును 8 వికెట్ల తేడాతో ఓడించింది. దాంతో ఆసియా కప్ భారత్ వశమైంది. చివరగా 14 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన స్థితిలో శిఖర్ ధావన్ అవుట్ కావడంతో బరిలోకి దిగిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.

కేవలం ఆరు బంతుల్లో రెండు సిక్సులు, ఓ ఫోర్ సాయంతో 22 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 28 బంతుల్లో 41 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. బంగ్లాదేశ్ తన ముందు ఉంచింన 121 పరుగుల లక్ష్యాన్ని 13.5 ఓవర్లలో భారత్ ఛేదించి ఘన విజయాన్ని అందుకుంది. వర్షం కారణంగా మ్యాచును 15 ఓవర్లకేసి కుదించారు.

Asia Cup T20 Final: India won the toss elected to bowl

ధోనీ నాయకత్వంలో భారత్ రెండోసారి ఆసియా కప్ ను గెలుచుకుంది. మొత్తంగా భారత్ ఆరు సార్లు ఈ ఆసియా కప్ ను గెలుచుకుంది.

ఆసియా కప్ ఫైనల్ మ్యాచులో బంగ్లాదేశ్ పై భారత్ నిలకడగా ఆడుతున్న క్రమంలో భారీ షాట్ కు వెళ్లి శిఖర్ ధావన్ అవుటయ్యాడు. అతను 60 పరుగుల స్కోర్ వద్ద తష్కిన్ బౌలింగులో అవుటయ్యాడు. దీంతో భారత్ 99 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అప్పటికి భారత్ 14 బంతుల్లో 22 పరుగులు చేయాల్సి ఉంది. ధావన్ 35 బంతుల్లో అర్థ సెంచరీ చేశాడు. అతను 8 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 51 పరుగులు చేశాడు.

బంగ్లాదేశ్ తన ముందుంచిన 121 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఐదు వరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఆల్ అమీన్ హొస్సేన్ బౌలింగులో వెనుదిరిగాడు.

Asia Cup T20 Final: India won the toss elected to bowl

ఆసియా కప్ ట్వంటీ20 ఫైనల్ మ్యాచులో భారత్ పై మహ్మదుల్లా దంచికొట్టడంతో బంగ్లాదేశ్ ఐదు వికెట్ల నష్టానికి నిర్ణీత 15 ఓవర్లలో 120 పరుగులు చేసింది. మహ్మదుల్లా 13 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 33 పరుగులు చేశాడు. షబ్బీర్ రహ్మాన్ 29 బంతుల్లో 32 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. భారత బౌలర్లలో అశ్విన్, నెహ్రా, బుమ్రా, జడేజా తలో వికెట్ తీశారు.

భారత్‌తో ఆసియా కప్ ట్వంటీ20 ఫైనల్ మ్యాచులోజోరుగా ఆడుతున్న బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ నెహ్రా బౌలింగులో 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ 27 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్ కోల్పోయింది.

బంగ్లాదేశ్ 30 పరుగుల స్కోరు వద్ద రెండో వికెట్ కోల్పోయింది. తమీమ్ ఇక్బాల్ బుమ్రా బౌలింగులో 13 పరుగుల వ్యకిగత స్కోరు వద్ద ఎల్బీడబ్ల్యుగా వెనుదిరిగాడు. బంగ్లాదేశ్ 64 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. షకీబ్ ఆల్ హసన్ 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగులో అవుటయ్యాడు.

బంగ్లాదేశ్ 75 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగులో మోర్తాజా డకౌట్ అవుయ్యాడు. అంతకు ముందు ముషాఫికర్ రహీం 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. 75 పరుగుల వద్దే ఈ వికెట్ పడిపోయింది.

Asia Cup T20 Final: India won the toss elected to bowl

ఆసియా ట్వంటీ20 కప్ ఫైనల్ మ్యాచులో భారత్ ఆదివారం రాత్రి టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభంలో ఆలస్యం జరిగింది. మ్యాచ్‌ను 15 ఓవర్లకేసి కుదించారు. టాస్ వేయడంలో జాప్యం జరిగింది. వర్షంతో పాటు బలమైన గాలులు వీచాయి.

వర్షం కారణంగా రెండు గంటల ఆట నష్టం జరిగింది. బంగ్లాదేశ్ కాలమానం ప్రకారం టాస్ 9.10 గంటలకు (భారత కాలమనం ప్రకారం 8.40 గంటలు) వేశారు. మ్యాచ్ స్థానిక కాలమానం ప్రకారం 9.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం 9 గంటలకు) ప్రారంభమవుతుంది.

మ్యాచును 15 ఓవర్లకేసి కుదించడంతో 5 ఓవర్ల పవర్ ప్లే ఉంటుంది. బౌలర్లు గరిష్టంగా మూడేసి ఓవర్లు మాత్రమే బౌల్ చేయాల్సి ఉంటుంది. ఇన్నింగ్సు మధ్య పది నిమిషాల వ్యవధి ఉంటుంది.

భారత్ తుది జట్టులో నెహ్రా, అశ్విన్, జడేజాకు చోటు కల్పించారు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కోహ్లీ, ధోనీ, రైనా, యువరాజ్, పాండ్యా, బుమ్రాలతో జట్టు పటిష్టంగా ఉంది. హర్భజన్, నేగి, భువనేశ్వర్ కుమార్‌లకు విశ్రాంతి ఇచ్చారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+