ఆసియా కప్‌లో అరుదైన ఘనత: సచిన్, ద్రవిడ్ సరసన శిఖర్ ధావన్

హైదరాబాద్: ఆసియా కప్ టోర్నీలో భాగంగా శుక్రవారం దుబాయి వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన ఘనత సాధించాడు. ఒకే వన్డే మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు పట్టిన ఏడో భారతీయ ఫీల్డర్‌గా శిఖర్ ధావన్ గుర్తింపు పొందాడు.
గతంలో సునీల్ గావస్కర్ (పాక్‌పై షార్జాలో; 1985), అజహరుద్దీన్ (పాక్‌పై టొరంటోలో; 1997), సచిన్ టెండూల్కర్ (పాక్‌పై ఢాకాలో; 1998), రాహుల్ ద్రవిడ్ (విండీస్‌పై టొరంటోలో; 1999), మొహమ్మద్ కైఫ్ (శ్రీలంకపై జొహన్నెస్‌బర్గ్‌లో; 2003), వీవీఎస్ లక్ష్మణ్ (జింబాబ్వేపై పెర్త్‌లో; 2004) ఈ ఘనత సాధించారు.

వన్డే ఫార్మాట్‌లో చెలరేగుతోన్న ధావన్
ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన టెస్టుల్లో పేలవ ప్రదర్శన చేసిన శిఖర్ ధావన్ తనకు ఎంతగానో అచ్చొచ్చిన వన్డే ఫార్మాట్‌లో చెలరేగుతున్నాడు. ప్రస్తుతం ఆసియా కప్‌లో భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే, శుక్రవారం బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్‌తో రాణించకున్నా ఫీల్డింగ్‌లో రాణించాడు.

నాలుగు క్యాచ్‌లు పట్టిన ధావన్
ఈ మ్యాచ్‌లో ధావన్ బంగ్లా ఆటగాళ్లు నాజ్ముల్ హాసన్, షకీబ్ ఉల్ హాసన్, మెహదీ హాసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ల క్యాచ్‌లను పట్టి ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక వన్డేలో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ (5) అగ్రస్థానంలో ఉన్నాడు.

ఈ జాబితాలో అగ్రస్థానంలో జాంటీ రోడ్స్
1993 ముంబైలో వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో జాంటీ రోడ్స్ ఈ ఘనత సాధించాడు. కాగా, ఆసియా కప్ టోర్నీలో ధావన్ ఇప్పటివరకు 96.38 యావరేజితో 213 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధావన్ 47 బంతుల్లో 40 పరుగులు చేశాడు. సూపర్-4లో భాగంగా శుక్రవారం దుబాయి వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది.

173 పరుగులకే ఆలౌటైన బంగ్లాదేశ్
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 173 పరుగులకే ఆలౌటైంది. మెహదీ హసన్ మిరాజ్ (42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (4/29) చెలరేగగా, భువనేశ్వర్, బుమ్రా చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఏకంగా 190 డాట్ బంతులు (31.4 ఓవర్లు) ఆడింది. దీనిని బట్టి భారత బౌలింగ్ ఎంత కట్టుదిట్టంగా ఉందో అర్థమవుతుంది.

హాఫ్ సెంచరీతో రాణించిన రోహిత్ శర్మ
అనంతరం 174 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 36.2 ఓవర్లలో 3 వికెట్లకు 174 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది. రోహిత్ శర్మ (104 బంతుల్లో 83 నాటౌట్) వరుసగా ఈ టోర్నీలో రెండో హాఫ్ సెంచరీతో రాణించగా, శిఖర్ ధావన్ (47 బంతుల్లో 40), ధోని (37 బంతుల్లో 33) రాణించారు. ఆసియా కప్ టోర్నీలో శనివారం విశ్రాంతి దినం కావడంతో మ్యాచ్‌లు లేవు. దీంతో ఆదివారం టోర్నీలో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications