
శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిష్ఠాత్మక ఆసియా కప్‌ను ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 7వ తేదీల మధ్య నిర్వహించడానికి డేట్స్ రీషెడ్యూల్ చేసింది. ఈ మేరకు ఈ టోర్నీలో పాల్గొనే దేశాల బోర్డుల సమ్మతిని కోరింది. ఆయా బోర్డులు ఇందుకు సుముఖంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఆసియా కప్ 18వ ఎడిషన్ ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. తాజాగా రీషెడ్యూల్ చేసిన దాని ప్రకారం.. ఆగస్టు 24నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఇకపోతే పాకిస్థాన్, భారత్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక ఈ టోర్నీలో రెగ్యులర్ జట్లుగా కొనసాగుతుండగా.. యూఏఈ, కువైట్, ఒమన్ లాంటి దేశాలలో ఓ జట్టు ఆరో ప్లేస్ కోసం పోటీపడతాయి. ఇక క్వాలిఫైయర్‌లలో ప్రతి టీం మరో టీంతో పోటీ పడుతుంది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 7న జరగనుంది. ఆసియా కప్ సాధారణంగా వన్డే ఫార్మాట్, టీ20ఫార్మాట్లలో జరుగుతుంది. ఇక ఈ ఏడాది అక్టోబరులో టీ20ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో ఈసారి ఈ టోర్నీని టీ20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. ఇక చివరిగా 2018లో ఈ టోర్నీ జరిగింది. ఆ టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది.
2020లో ఆసియా కప్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తుంది. తొలుత 2021లో నిర్వహించాలని వాయిదా వేయగా.. తర్వాత మళ్లీ 2022కి మార్చారు. ఇక శ్రీలంక దేశంలో ఆర్థిక స్థితిగతులు పూర్తిగా దెబ్బతిన్న తరుణంలో మళ్లీ ఈ టోర్నీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇక చివరి శ్రీలంక బోర్డు ఆగస్టు 24న ఆసియా కప్ ప్రారంభించడానికి సిద్ధమైంది. ఇకపోతే అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూళ్లు ఉండడంతో పాకిస్తాన్‌తో సహా పాల్గొనే రెండు జట్ల నుండి శ్రీలంక బోర్డుకు వినతులు అందడంతో ఆ వినతులను స్వీకరించిన బోర్డు ఈ డేట్లలో టోర్నీ నిర్వహించడానికి షెడ్యూల్ ఖరారు చేసింది. ఇకపోతే సెప్టెంబర్ చివర్లో ఇంగ్లాండ్‌తో జరగబోయే 7 టీ20 ఇంటర్నేషనల్‌లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది.