Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup Rising Stars: డిఫెండింగ్ ఛాంపియన్‌కు షాక్! సెమీస్‌ ఇండియా ఫైట్ ఫిక్స్!

Asia Cup Rising Stars 2025: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిష్క్రమించింది. ఈ సారి ఆ జట్టుకు సెమీ-ఫైనల్లో కూడా స్థానం దక్కలేదు. గ్రూప్ రౌండ్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు మూడో స్థానంలో నిలిచింది. గ్రూప్-ఏ నుంచి పాకిస్తాన్, భారత్ సెమీ-ఫైనల్లోకి ప్రవేశించగా.. గ్రూప్-బి నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు సెమీస్‌లో చోటు దక్కించుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌కు శ్రీలంక, బంగ్లాదేశ్‌తో సమానమైన పాయింట్లు ఉన్నప్పటికీ.. తక్కువ నెట్ రన్ రేట్ కారణంగా జట్టు టోర్నమెంట్ నుంచి వైదొలగాల్సి వచ్చింది.

ఇండియా-ఎ Vs బంగ్లాదేశ్-ఎ
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ మొదటి సెమీస్ మ్యాచ్‌లో ఇండియా-ఎ జట్టు బరిలోకి దిగనుంది. ఈ జట్టు బంగ్లాదేశ్-ఎ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ నవంబర్ 21న భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఇండియా-ఎ తమ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచింది. పాకిస్తాన్‌పై ఓటమి చవిచూసినప్పటికీ.. యూఏఈ, ఒమన్‌లపై తమ మ్యాచ్‌లను గెలుచుకుంది. బంగ్లాదేశ్ తమ గ్రూప్‌లో మొదటి స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ జట్టు ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్‌లను ఓడించింది. అయితే శ్రీలంక చేతిలో ఓడిపోయింది.

Asia Cup Rising Stars 2025 Afghanistan Eliminated India and Bangladesh Advance to Semis

పాకిస్తాన్-ఎ Vs శ్రీలంక-ఎ మధ్య పోరు
టోర్నమెంట్ రెండో సెమీ-ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్-ఎ, శ్రీలంక-ఎ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ నవంబర్ 21న రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ రెండు మ్యాచ్‌లు దోహాలోని వెస్ట్ ఎండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. పాకిస్తాన్-ఎ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఓటమి ఎరుగని ఏకైక జట్టు. సెమీ-ఫైనల్స్‌లో గెలిచిన రెండు జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. నవంబర్ 23, ఆదివారం నాడు ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 కొత్త విజేత ఎవరో తెలిసిపోనుంది. సెమీ-ఫైనల్‌కు చేరుకున్న జట్లలో బంగ్లాదేశ్ మాత్రమే ఇప్పటివరకు ఈ టోర్నమెంట్‌ను గెలవలేదు.

సెమీ-ఫైనల్స్ షెడ్యూల్
*సెమీ-ఫైనల్-1- 21 నవంబర్ 2025 ఇండియా-ఎ Vs బంగ్లాదేశ్-ఎ, మధ్యాహ్నం 03:00 గంటలకు
సెమీ-ఫైనల్-2 -21 నవంబర్ 2025 పాకిస్తాన్-ఎ Vs శ్రీలంక-ఎ, రాత్రి 08:00 గంటలకు

Story first published: Thursday, November 20, 2025, 9:59 [IST]
Other articles published on Nov 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+