హై ఓల్టేజ్ మ్యాచ్‌గా భారత్-పాక్ మ్యాచ్: ఒకే టోర్నీలో మూడు సార్లు తలపడేనా?


హైదరాబాద్: ఆసియా కప్‌లో ఎన్ని మ్యాచ్‌లు జరిగినా భారత్-పాక్ మ్యాచ్‌కు ఉండే ప్రత్యేకతే వేరు. ఆసియా కప్ షెడ్యూల్ విడుదలైనప్పట్నించి ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాలకు చెందిన అభిమానులతో పాటు క్రికెట్ ప్రపంచమంతా ఎంతో ఆసిక్తిగా ఎదురు చూస్తోంది. గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్థాన్‌తో పాటు హాంకాంగ్ జట్లు టైటిల్ రేస్‌లో ఉన్నాయి.
రౌండ్ రాబిన్ పద్ధతిన టోర్నీ జరుగుతుండటంతో గ్రూప్ దశలో మూడు జట్లు మిగతా రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. దీంతో మంగళవారం హాంకాంగ్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న టీమిండియా... ఆ తర్వాతి రోజైన బుధవారం పాకిస్థాన్‌తో అమీతుమీత తేల్చుకోనుంది. అయితే, ఆసియా కప్ చరిత్రలో పాకిస్థాన్‌పై ముఖాముఖి పోరులో టీమిండియాదే పైచేయి కావడం విశేషం.

ఇప్పటివరకు 12 సార్లు తలపడ్డ భారత్-పాక్ జట్లు
ఆసియా కప్‌లో భారత్-పాక్ జట్లు ఇప్పటివరకు 12 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 6 సార్లు నెగ్గగా, పాక్ 5 సార్లు విజయం సాధించింది. ఒకసారి ఫలితం తేలలేదు. ఆసియా కప్‌లో అత్యంత విజయవంతమైన దేశంగా భారత్‌కు పేరుంది. ఆసియా కప్‌ను భారత్ ఆరు సార్లు నెగ్గగా, పాకిస్థాన్ కేవలం రెండు సార్లు మాత్రమే సాధించింది.

భారత్-పాక్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు
అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ టోర్నీలో భారత్-పాక్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు (ఫైనల్‌తో కలిపి) జరిగే అవకాశం ఉంది. ఆసియా కప్ షెడ్యూల్ ప్రకారం గ్రూప్ దశలో ఓ సారి, సూపర్ ఫోర్ రౌండ్‌లో మరోసారి చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో పోటీ పడే అవకాశం ఉంది. గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్థాన్‌తో పాటు ఒక క్వాలిఫైయర్ జట్టు పోటీపడతాయి.

హాంకాంగ్‌పై విజయం సాధిస్తే సూపర్ ఫోర్‌కు అర్హత సాధించినట్లే
గ్రూప్ దశలో ఇప్పటికే పాకిస్థాన్ జట్టు హాంకాంగ్‌పై విజయం సాధించడంతో సూపర్ ఫోర్‌కు అర్హత సాధించినట్లే. మరోవైపు మంగళవారం హాంకాంగ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే సూపర్ ఫోర్‌కు అర్హత సాధించినట్లే. సూపర్ ఫోర్ రౌండ్‌కు అర్హత సాధించిన నాలుగు జట్లు మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.

ఆసియా దేశాల్లో అత్యంత పటిష్టమైన జట్టుగా భారత్
దీంతో సూపర్ ఫోర్ రౌండ్‌లో మరోసారి భారత్-పాక్ జట్లు రెండోసారి పోటీ పడతాయి. ప్రస్తుతం ఆసియా దేశాల్లో అత్యంత పటిష్టమైన జట్టుగా భారత్ ఉంది. మరోవైపు ఇప్పటికే టోర్నీ నుంచి శ్రీలంక నిష్క్రమించడంతో టైటిల్ పోరులో భారత్-పాకిస్థాన్ జట్లే పోటీపడతాయని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఒకే టోర్నీలో పాక్‌తో మూడు మ్యాచ్‌లు
ఎందుకంటే బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ జట్లతో పోలిస్తే పాకిస్థాన్ జట్టే బలంగా ఉండటమే ఇందుకు కారణం. ఇరు జట్లు సూపర్ ఫోర్ రౌండ్ దాటితే భారత్-పాకిస్థాన్ మద్య ఫైనల్ మ్యాచ్ చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది. దీంతో ఒకే టోర్నీలో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో మూడు మ్యాచ్‌లు అంటే అభిమానులకు సైతం పండుగే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications