
న్యూ ఢిల్లీ: ఐదు రోజులుగా జరుగుతోన్న ఆసియాకప్‌లో భారత్ బుధవారం రెండో మ్యాచ్ ఆడింది. ఇందులో భాగంగానే పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. పాక్‌ను 162 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా.. ఆపై లక్ష్యాన్ని 29 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఫలితంగా ఇంతకుముందున్న రికార్డుల కంటే భారత్ ఒక కొత్త రికార్డును నమోదు చేసింది. ఇది బంతుల పరంగా చూస్తే భారత్‌కు అతి పెద్ద విజయం. ఇంకా 126 బంతులు(21 ఓవర్లు) ఉండగానే భారత్ గెలుపును సొంతం చేసుకుంది. దాంతో పాక్‌పై గతంలో 105 బంతులు ఉండగా సాధించిన విజయాన్ని టీమిండియా తాజాగా సవరించింది.
2006లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో భారత్ 105 బంతులు మిగిలి ఉండగా గెలుపును సొంతం చేసుకుంది. ఇదే ఇప్పటివరకూ భారత్‌కు పాక్‌పై భారీ విజయం కాగా, ఇప‍్పుడు దాన్ని తిరగరాస్తూ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. 1997లో 117 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో టీమిండియా 92 బంతులు ఉండగా విజయాన్ని సాధించింది. ఈ మూడు బంతులు పరంగా చూస్తే పాక్‌పై భారత్ సాధించిన అతిపెద్ద విజయాలుగా ఉన్నాయి.
టీమిండియాతో పాకిస్తాన్ మరో సారి తలపడనున్న మ్యాచ్ సెప్టెంబర్ 23వ తేదీన ఆదివారం జరగనుంది. ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్ మ్యాచ్ తలపడిన భారత్-పాక్‌లు మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని పాక్ క్రికెట్ అభిమానులు.. బుధవారం దుబాయ్ వేదికగా తీసుకొచ్చిన ఫలితం రాబడితే చాలని టీమిండియా అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.