
భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి
అప్పట్లో వన్డే టోర్నమెంట్‌లకు మరో దారి చూపెట్టింది. ఈ టోర్నీ ఆరంభోత్సవంలో పాల్గొన్న భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగింది. అంతకుముందు సంవత్సరం 1983లో ఐసీసీ ప్రూడెన్షియల్ ప్రపంచ కప్ విజేతగా నిలిచింది టీమిండియా. ఆ టోర్నీ మూడు మ్యాచ్‌లతోనే విజేతను ఖరారు చేసేసుకుంది. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంకలు పోరాడిన టోర్నీలో భారత్‌యే విజయాన్ని సొంతం చేసుకుంది.

భారత్.. టోర్నీకి పూర్తి స్థాయిలో పాల్గొనకపోవడం
అంతటి విజయం సాధించిన భారత్ జట్టులో గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ టోర్నీకి పూర్తి స్థాయిలో జట్టు పాల్గొనకపోవడం. కపిల్ దేవ్, కే శ్రీకాంత్, సయ్యద్ కిర్మణీ, మోహిందర్ అమర్‌నాథ్‌లు వరల్డ్ కప్ టోర్నీ తర్వాత విరామం తీసుకున్నారు. వారి స్థానంలో మనోజ్ ప్రభాకర్, చేతన్ శర్మ, సురేందర్ ఖన్నాలు జట్టులో భాగమైయ్యారు. ఈ టోర్నీలో భారత్ శ్రీలంకపై పది వికెట్ల తేడాతో శుభారంభాన్ని నమోదు చేసింది.

21.4 ఓవర్లకే లక్ష్యాన్ని చేధించగలిగారు
41 ఓవర్లు ఆడిన శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ను 96పరుగులకే ఆలౌట్ చేసింది భారత్ బృందం. భారత్ బౌలర్లు చేతన్(3-22), మదన్ లాల్ (3-11), ప్రభాకర్ (2-16) లంక యువ క్రికెటర్లను గడగడలాడించారు. అంతేస్థాయిలో రెచ్చిపోయిన భారత్ బ్యాట్స్‌మెన్ సురేందర్ ఖన్నా 69 బంతులకి (51), గులామ్ పార్కర్ 68 బంతులకు (32) పరుగులు చేసి 21.4 ఓవర్లకే లక్ష్యాన్ని చేధించగలిగారు. ఇక భారత్ రెండో మ్యాచ్‌ను పాకిస్తాన్‌తో ఆడింది. ఆ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్దేశించిన 46 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.

9.4 ఓవర్లకే మ్యాచ్‌ను ముగించేసి:
ఓపెనర్ ఖన్నా మరోసారి 72 బంతులకు 56 పరుగులు చేసి స్కోరును పరుగులు పెట్టించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ పార్కర్(22), సందీప్ పాటిల్(43), సునీల్ గవాస్కర్(36)లు సైతం విజృంభించి ఆడారు. భారత్ తలపడిన విధంగానే పాకిస్తాన్ కూడా పూర్తి జట్టుతో టోర్నీ ఆడలేదు. ఇమ్రాన్ ఖాన్, జహీర్ అబ్బాస్‌లను మినహాయించి బరిలోకి దిగింది. ఇక ఈ మ్యాచ్‌లో రోజర్ బిన్నీ (3-33), రవి శాస్త్రి(3-40) కలిపి ఆరు వికెట్లు తీయగలిగారు. ఇలా ప్రత్యర్థిని 39.4 ఓవర్లకే ముగించేసి విజయాన్ని సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications
