'ఆసియా కప్ టోర్నీలో టీమిండియానే ఆధిపత్యం సాధించేది'


బెంగుళూరు: కొన్ని సంవత్సరాలుగా వన్డే టోర్నమెంట్లతో పాటు ఐసీసీ 50 ఓవర్ల ప్రపంచ కప్, ఐసీసీ వరల్డ్ టీ 20, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలలో భారత్ విజయ పంథాను కొనసాగిస్తూనే ఉంది. కొద్ది మేరకే భారత్ ట్రోఫీలను కోల్పోయింది. కానీ, ఆసియా కప్ టోర్నమెంట్‌లో సాధించిన ఆధిక్యత మరే దాంట్లో భారత్ తెచ్చుకోలేకపోయింది. ఇప్పటివరకూ జరిగిన 13 ట్రోఫీలలో భారత్ ఏకంగా ఆరు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది.

ఆ మూడు సార్లు ఫైనల్‌లో లంకను ఓడించిన భారత్:
ఆఖరి సారి జరిగిన టోర్నీలోనూ భారత్‌యే విజేత. ఈ క్రమంలో భారత్ తర్వాతి స్థానంలో శ్రీలంక నిలిచింది. కానీ, భారత ఆధిక్యత ప్రత్యేకంగా మూడు టోర్నీల్లో (1988, 1990-91, 1995) విశేషంగా నిలిచింది. ఈ మూడు టోర్నీల్లో మాత్రం భారత్ ఫైనల్స్‌లో శ్రీలంకనే ఓడించింది.

1988లో శ్రీలంకను 6 వికెట్ల తేడాతో ఓడించిన భారత్:
అప్పట్లో భారత జట్టుకు క్రిస్ శ్రీకాంత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నవజోత్ సింగ్ సిద్ధు 87 బంతుల్లో 76 బాదాడు. ఈ క్రమంలో భారత్‌ను శ్రీలంక ఓడించేస్తుందనుకుంటున్న తరుణంలో మ్యాచ్‌లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. కేవలం లంక నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యాన్ని 37.4 ఓవర్లలో భారత్ చేధించి విజయ పతకాన్ని ఎగరేసింది.

1990-91 శ్రీలంకను 7 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా:
ఆ సమయంలో టోర్నమెంట్‌లో పాల్గొన్న టీమిండియా.. పాకిస్తాన్‌ల మధ్య రాజకీయ విభేదాలు తలెత్తాయి. అదే సమయంలో లీగ్ సెక్షన్‌లో శ్రీలంక భారత్‍ను 36 పరుగుల తేడాతో ఓడించింది. ఎట్టకేలకు భారీ అంచనాలతో భారత్.. శ్రీలంకకు మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో సచిన్ టెండూల్కర్ (53), సంజయ మంజ్రేకర్ (75), మొహమ్మద్ అజారుద్దీన్(54) లు బాదారు. కపిల్ దేవ్ తన బౌలింగ్ మాయాజాలంతో నాలుగు వికెట్లు తీసి 31 పరుగులు ఇచ్చాడు. ఈ క్రమంలో 45 ఓవర్లకు 9వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసిన శ్రీలంకను కేవలం 42.1 ఓవర్లలోనే భారత్ చేధించింది.

1995 శ్రీలంకను 8 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా:
భారత్ .. లంక.. పాకిస్థాన్‌ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో నెట్ రన్ రేట్ ఆధారంగా భారత్.. శ్రీలంకలు ఫైనల్‌లో తలపడ్డాయి. భారత్ 4.85, శ్రీలంక 4.70, పాకిస్థాన్ 4.59గా ఉన్నాయి. ఈ క్రమంలో లంక 50 ఓవర్లకు 230 పరుగులు చేసింది. ఆ జట్టులో ఆసాంకా గురుసింహ 85పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ సమయంలో భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ విజృంభించారు. దాంతో సచిన్ (41), సిద్దు(84), అజారుద్దీన్ (90) ధాటిగా ఆడడంతో 41.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి పెప్సీ ఆసియా కప్‌ను గెలుచుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications