Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup: కరోనా ఎఫెక్ట్.. ఆసియా కప్​ రద్దు!!

Asia Cup called off due to rising Coronavirus cases in Sri Lanka
#AsiaCup2021 Cancelled Due To Rising COVID-19 Cases In Sri Lanka || Oneindia Telugu

కొలొంబో: శ్రీలంక వేదికగా జూన్​లో జరగాల్సిన ఆసియా కప్ రద్దయింది. శ్రీలంకలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో టోర్నీని రద్దు చేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) సీఈఓ యాష్లే డిసిల్వా బుధవారం వెల్లడించారు. 'కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆసియా కప్​ నిర్వహించడం కష్టం. అందుకే జూన్​లో జరగాల్సిన ఈ టోర్నీని రద్దు చేస్తున్నాం' అని డిసిల్వా అన్నారు. చివరిసారిగా 2018లో జరిగిన ఆసియా కప్ జూన్‌లో జరగాల్సి ఉంది.

వాస్తవానికి గతేడాది పాకిస్థాన్​లో జరగాల్సిన ఈ ఆసియా కప్​ వేదికను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) శ్రీలంకకు తరలించింది. ఇటీవలి కాలంలో భారత్​-పాక్​ మధ్య నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్ల టీమిండియా ఆటగాళ్లు పాక్​లో పర్యటించడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖుత వ్యక్తం చేసింది. భారత జట్టు పాల్గొనడానికి సిద్ధంగా లేని క్రమంలో హక్కులను వదిలేసుకోవడానికి ఇష్టంలైన్ పీసీబీ.. వేదికను శ్రీలంకకు మార్చింది.

ఆసియా కప్ రద్దు విషయంపై జై షా నేతృత్వంలోని ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఆసియా కప్​లో పాల్గొనాల్సిన అన్ని జట్లు తమ క్రికెట్ క్యాలెండర్​ను రెండేళ్లకు నిర్ణయించాయి. దీంతో 2023 ప్రపంచకప్ తర్వాత మాత్రమే ఆసియా కప్​టోర్నీని నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. చివరిసారిగా 2018లో జరిగిన ఆసియా కప్.. మళ్లీ ఎప్పుడు జరుగుతుందో చూడాలి. చివరిసారి పాకిస్తాన్ కప్ గెలుచుకుంది.

కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో లంక ప్రభుత్వం అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై10 రోజుల నిషేధం విధించింది. శ్రీలంక పరిమిత ఓవర్ల సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో ప్రయతించనుంది. మరోవైపు జూలైలో ఆరు మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం భారత బీ జట్టు లంకలో పర్యటించనుంది. విరాట్ కోహ్లీ నేత్రుత్వంలోని భారత జట్టు టెస్టు ఛాంపియన్‌ఫిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్, ఇంగ్లండ్ పర్యటన కోసం లండన్ వెళ్లనుంది.

Story first published: Wednesday, May 19, 2021, 22:00 [IST]
Other articles published on May 19, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+