Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాక్‌పై భారత్ గెలుపు: పాక్ ఫ్యాన్‌కు ధోనీ టిక్కెట్

మీర్పూర్: మీర్పూర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ట్వంటీ 20 మ్యాచ్‌లో భారత్ అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్ష్య చేధనలో భారత్ తడబడినప్పటికీ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‍‌కు యువరాజ్ సింగ్ తోడు కావడంతో భారత్ 15.3 ఓవర్లలో విజయం సాధించింది.

కెప్టెన్ ధోనీ కొట్టిన బౌండరీతో టీమిండియా గెలుపు తీరం చేరింది. కాగా, ఒకే ఒక్క పరుగుతో విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ మిస్సయ్యాడు. మహమ్మద్ సమీ వేసిన బంతిని ఆడబోయిన కోహ్లి(ఎల్బీడబ్ల్యు) అవుటవడంతో అభిమానులు నిరుత్సాహపడ్డారు.

తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 83 పరుగులకే కుప్పకూలింది. పేసర్లు ఆరంభం నుంచే చెలరేగిపోగా ఫీల్డర్లు కూడా పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఓ సమయంలో పాక్ 2 వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత 14 పరుగుల వ్యవధిలోనే.. అంటే 42 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.

Asia Cup: Bowlers, Kohli set up India's win against Pakistan

ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్ తడబడింది. ఇద్దరు ఓపెనర్లు డకౌట్ అయ్యారు. ట్వంటీ 20ల ఇద్దరు ఓపెనర్లు డకౌట్కావడం ఇది తొలిసారి. మరోవైపు ఈ మ్యాచులో ఒక్క సిక్సర్ నమోదు కాలేదు. ట్వంటీ 20 మ్యాచులలో ఒక్క సిక్సర్ నమోదు కాకపోవడం ఇది ఆరోసారి.

విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడాడు. సమయం వచ్చినప్పుడు ఫోర్ కొడుతూ జట్టును విజయతీరాలకు చేర్చాడు. కోహ్లీకి యువరాజ్ సింగ్ స్టాండింగ్ ఇచ్చాడు. భారత్ 5 వికెట్లు కోల్పోయి 15.3 ఓవర్లలో 85 పరుగులు చేసింది. అంతకుముందు పాక్ 17.3 ఓవర్లలో 83పరుగులకు ఆలౌట్ అయింది.

సత్తాచాటిన పాక్ బౌలర్ అమీర్

ఒకప్పుడు పాక్ పరువు తీశాడని తిట్లుతిన్న అమీర్.. శనివారం ఆ జట్టు పరువు నిలిపే ప్రదర్శన చేశాడు. 18 ఏళ్ల వయసులోనే ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్‌ బౌలర్లలో ఒకడిగా కితాబందుకుని.. ఉజ్వల కెరీర్‌ దిశగా సాగుతున్న అమీర్.. స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో చిక్కుకుని ఐదేళ్ల నిషేధానికి గురయ్యాడు.

Asia Cup: Bowlers, Kohli set up India's win against Pakistan

నిషేధం పూర్తి చేసుకున్నాక ఇబ్బందులు పడి ఇప్పుడు పునరాగమనం చేశాడు. శనివారం నాటి అతడి బౌలింగ్‌ ప్రదర్శనను ఎంత పొగిడినా తక్కువే. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఓడినప్పటికీ.. అమీర్ మాత్రం అందరి మనసులూ గెలిచాడు. అతను తొలి స్పెల్‌లో 2 ఓవర్లు వేసి 3 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అమీర్ పైన విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. బౌలింగ్ చేస్తున్నప్పుడే అతనికి అభినందనలు తెలిపానని కోహ్లీ చెప్పాడు.

మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ... ఒక్కోసారి పరిస్థితులకు తగ్గట్టు కూడా ఆడాలని, కోహ్లి, యువరాజ్ నిలబడి జట్టును ఆదుకున్నారని, పాక్‌పై క్రమం తప్పక వికెట్లు తీసి పేస్‌ బౌలర్లు ఆకట్టుకున్నారని, అయితే టీ20 ఫార్మాట్లో వికెట్లు తీస్తూనే పరుగులు నియంత్రించాలన్నాడు.

పాక్ అభిమానికి టిక్కెట్ ఇప్పించిన ధోనీ

భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. భారత్ - పాక్ మధ్య జరిగిన మ్యాచుకు పాకిస్తాన్ అభిమానికి టిక్కెట్ ఇప్పించాడు. ధోనీ పాక్ అబిమాని పేరు మొహమ్మద్ బషీర్. వయస్సు 62. బషీర్ మాట్లాడుతూ.. ధోనీ తనకు శనివారం నాటి మ్యాచు కోసం పాస్ ఇప్పించారని చెప్పాడు. ఇతను భారత్ - పాక్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు సగం పాకిస్తాన్, సగం హిందుస్తాన్ (భారత్) దుస్తులతో వస్తాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+