For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Asia Cup 2025: ఈ సారి విజేత ఎవరో తెలుసా?

Asia Cup 2025: ఆసియా కప్ 2025 కోసం భారత జట్టును ప్రకటించే ముందు టోర్నమెంట్ విజేత గురించి అంచనాలు మొదలయ్యాయి. ఆసియా కప్ టోర్నీ ప్రారంభం కాకముందే భారత మాజీ క్రికెటర్ చేతన్ శర్మ ఈ సారి విజేతగా భారత జట్టు నిలుస్తుందని గట్టి నమ్మకం వ్యక్తం చేశారు. టీమ్ ఎంపికపై మాట్లాడుతూ.. భారత జట్టులో ఏ ఆటగాడిని ఎంపిక చేసినా వారందరూ దేశంలోని అత్యుత్తమ ఆటగాళ్లు అని, జట్టు చాలా బలంగా ఉందని ఆయన వివరించారు. ముఖ్యంగా ఇంగ్లండ్ జట్టుతో ఇటీవల జరిగిన మ్యాచ్‌లలో టీమిండియా ప్రదర్శన చాలా మెరుగ్గా ఉందని ఆయన ప్రశంసించారు.

భారత జట్టులో ఏ ఆటగాడిని ఎంపిక చేసినా వారు దేశంలో ఉత్తమ ఆటగాళ్లు అవుతారని చేతన్ శర్మ అన్నారు. దీనితో పాటు టీమిండియా ఆసియా కప్ గెలుస్తుందని, ఈ సారి టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరగనుందని వెల్లడించారు. మొత్తం ఎనిమిది జట్టు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటాయి. అవి: భారత్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, యూఏఈ, ఒమన్, హాంకాంగ్.

Asia Cup 2025 Winner Prediction India Favorite to Lift the Trophy

ఆసియా కప్ 2025 షెడ్యూల్ , వేదికలు

ఆసియా కప్ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో జరగనుంది. మొత్తం 19 మ్యాచ్‌లలో 11 మ్యాచ్‌లు దుబాయ్‌లో, 8 మ్యాచ్‌లు అబుదాబిలో నిర్వహిస్తారు.

ప్రారంభ మ్యాచ్: టోర్నమెంట్ తొలి మ్యాచ్ సెప్టెంబర్ 9న అబుదాబిలో హాంకాంగ్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగనుంది.

భారత్ షెడ్యూల్: టీమిండియా తన మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడుతుంది.

ఫైనల్ మ్యాచ్: ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న దుబాయ్‌లో జరుగుతుంది.

ఆసియా కప్ 2025 గ్రూపుల వివరాలు
టోర్నమెంట్‌లో పాల్గొనే ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.

గ్రూప్-ఎ: భారత్, పాకిస్థాన్, యూఏఈ, ఒమన్.
గ్రూప్-బి: శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, హాంకాంగ్.

బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి, పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, ఈ టోర్నమెంట్ తటస్థ వేదికలో జరుగుతోంది.

Story first published: Tuesday, August 19, 2025, 9:55 [IST]
Other articles published on Aug 19, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+