Asia Cup 2025: టీమిండియా తన అతిపెద్ద తలనొప్పికి ఓ పరిష్కారాన్ని కనుగొన్నట్లు తెలుస్తోంది. భారత బౌలంగ్ కోచ్ మోర్నే మోర్కెల్ చెప్పిన దాని ప్రకారం.. ఆల్-రౌండర్ శివమ్ దూబే ఇప్పుడు హార్దిక్ పాండ్యాకు పూర్తిస్థాయి రీప్లేస్మెంట్‌గా మారగలడని స్పష్టం చేశారు. గత ఏడాదిగా శివమ్ దూబే బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. శివమ్ దూబే హిట్టింగ్ సామర్థ్యంపై ఎవరికీ అనుమానం లేదు. కానీ బౌలింగ్‌లో శివమ్ దూబే చూపిస్తున్న మెరుగుదల జట్టుకు ఓ కొత్త బలాన్ని ఇస్తోంది.
ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్‌పై టీమ్ ఫోకస్
ఆసియా కప్‌లో యూఏఈతో జరగబోయే మొదటి మ్యాచ్‌కు ముందు బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ మీడియాకు ఈ విషయం గురించి స్పష్టం చేశారు. జట్టుకు కొన్నిసార్లు ఆరో లేదా ఏడో బౌలింగ్ ఆప్షన్ అవసరం అవుతుందని, అలాంటి సందర్భాలలో శివమ్ దూబే వంటి ఆల్‌రౌండర్లు చాలా కీలక పాత్ర పోషిస్తారని ఆయన అన్నారు. రాబోయే టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని శివమ్ దూబేను ఒక బ్యాకప్ మీడియం పేస్ బౌలర్‌గా తీర్చిదిద్దాలని తాము భావిస్తున్నామని మోర్కెల్ వెల్లడించారు.

బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ మాట్లాడుతూ.. "శివమ్ దూబే లాంటి కుర్రాడు నాలుగు ఓవర్లు వేయగలడా లేదా అని చూడటం మాకు ముఖ్యం. మేము ఎల్లప్పుడూ ఆల్‌రౌండర్‌లకు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిపైనా దృష్టి పెట్టమని చెబుతాం. చాలాసార్లు కుర్రాళ్ళు ప్రాక్టీస్‌లో ఒకదానిపై మాత్రమే దృష్టి పెడతారు, కానీ ఈ వాతావరణంలో మేము ఏ అవకాశాన్ని వదలదలచుకోలేదు." అని ఆయన అన్నారు.
దుబాయ్ పిచ్‌లు.. టీమ్ కాంబినేషన్
మోర్నే మోర్కెల్ ప్రకారం.. "పరిస్థితులు ఒక ఆటగాడికి అనుకూలంగా మారినప్పుడు.. ఆ రోజు బాగా ఆడాల్సిన బాధ్యత తీసుకోవాలి. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అలాంటి బాధ్యతను శివమ్‌కు అప్పగిస్తే అతను సిద్ధంగా ఉండాలి." అని ఆయన పేర్కొన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో భారత్ నలుగురు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో (కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా) ఆడింది. అయితే, ఆ టోర్నమెంట్ మార్చిలో జరగగా.. ప్రస్తుత ఆసియా కప్‌ను సెప్టెంబర్‌లో దుబాయ్ పిచ్‌లపై ఆడుతున్నారు. ఈ పిచ్‌లు తాజాగా ఉన్నాయని, వాటిపై ఎక్కువ గడ్డి ఉందని మోర్నే మోర్కెల్ చెప్పారు. మనం పిచ్‌ను చూసి, టీమ్ కాంబినేషన్, వ్యూహం ఏమిటో నిర్ణయించుకుంటామని ఆయన వివరించారు. ఈ ప్రకటనల ద్వారా హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో కూడా టీమిండియా ధీమాగా ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది.