Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2025: సైనికుల ప్రాణాల కంటే డబ్బులే ముఖ్యమా?

Asia Cup 2025: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు జరగనుందని అధికారికంగా ప్రకటించబడింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లో జరుగుతుందని భావిస్తున్నారు. ఏ నగరం ఏ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుందనే పూర్తి షెడ్యూల్ ఇంకా వెలువడనప్పటికీ, మ్యాచ్‌ల సమయాలు మాత్రం ప్రకటించారు. దీని ప్రకారం, భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూప్‌లో చేరాయి. గ్రూప్ దశలోనే తలపడనున్నాయి. ఈ నిర్ణయం భారత క్రికెట్ అభిమానులలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.

అభిమానుల ఆగ్రహానికి కారణం
బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. గత మే నెలలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య తీవ్రమైన యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ సమయంలో ఇరు దేశాల మధ్య పరస్పర దాడులు జరిగాయి. ముఖ్యంగా పాకిస్థాన్ సైనికుల కాల్పుల్లో కాశ్మీర్ సరిహద్దులో 20 మందికి పైగా భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా విషాదం నింపింది.

Asia Cup 2025 Public Anger Over India vs Pakistan Matches Is Profit Above Soldiers Lives

ఈ ఘటనను ఖండిస్తూ ఇరు దేశాల మధ్య ఇకపై ఎలాంటి క్రికెట్ మ్యాచ్ లు జరగకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇటీవల జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో పాకిస్థాన్‌తో ఆడటానికి పలువురు ప్రముఖ భారత ఆటగాళ్లు నిరాకరించడంతో ఆ మ్యాచ్ రద్దైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు ఒకసారి కాకుండా గరిష్టంగా మూడు సార్లు తలపడే అవకాశం ఏర్పడింది.

బీసీసీఐపై అభిమానుల ప్రశ్నల వర్షం
ఈ పరిణామంపై అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆసియా కప్‌లో పాకిస్థాన్ జట్టుతో ఆడబోమని భారత్ ఖరాఖండిగా చెప్పి ఉండాల్సిందని లేదా ఆసియా కప్ టోర్నమెంట్ నుంచే భారత్ తప్పుకొని ఉండాల్సిందని అభిమానులు గట్టిగా వాదిస్తున్నారు. "అసలు బీసీసీఐ ఈ టోర్నమెంట్‌కు ఎందుకు అంగీకరించింది?" అని వారు ప్రశ్నిస్తున్నారు. సైనిక బలగాల ప్రాణాల కంటే డబ్బులే ముఖ్యమా అని పలువురు సోషల్ మీడియాలో బీసీసీఐని నిలదీస్తున్నారు. అంతే కాకుండా.. ఒక వేళ భారత్, పాకిస్థాన్‌తో తలపడితే, ఇకపై ఏ భారత మ్యాచ్‌లను చూడబోమని, వాటిని పూర్తిగా బహిష్కరిస్తామని కూడా వారు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.

Story first published: Sunday, July 27, 2025, 12:14 [IST]
Other articles published on Jul 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+