Asia Cup 2025: పాకిస్తాన్ జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాళ్లకు మొండిచేయి!
Asia Cup 2025: ఆసియా కప్ 2025 కోసం పాకిస్థాన్ 17 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. అయితే మాజీ కెప్టెన్ బాబర్ ఆజం, వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్‌లకు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఈ అనూహ్య నిర్ణయం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. సల్మాన్ అలీ ఆఘా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. మహమ్మద్ హారిస్ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యారు. స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది, ఫఖర్ జమాన్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు జట్టులో చోటు లభించినప్పటికీ.. బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్‌ల పేర్లు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
జట్టు వివరాలు.. కీలక మ్యాచ్‌లు
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆసియా కప్‌తో పాటు అఫ్ఘానిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తో జరిగే ట్రై-సిరీస్ కోసం కూడా ఈ జట్టును ప్రకటించింది. జట్టులో హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఫహీమ్ అష్రఫ్ వంటి కీలక ఆటగాళ్లతో పాటు, యువ ఆటగాళ్లైన సయీమ్ అయూబ్, హసన్ నవాజ్ లకు కూడా అవకాశం కల్పించారు.

ఆసియా కప్ 20225 సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు యూఏఈలో జరగనుంది. టోర్నమెంట్‌లో పాకిస్థాన్, భారత్, యూఏఈ, ఒమన్ ఒకే గ్రూప్ 'ఏ' లో ఉన్నాయి. పాకిస్తాన్ తమ మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 12న ఒమన్‌తో ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న భారత్‌తో, సెప్టెంబర్ 17న యూఏఈతో తలపడనుంది. 2023లో జరిగిన ఆసియా కప్ లో పాకిస్థాన్ ప్రదర్శన నిరాశపరిచింది. వన్డే ఫార్మాట్‌లో జరిగిన ఆ టోర్నమెంట్ లో సూపర్ 4లో మూడు మ్యాచ్ లలో రెండు ఓడిపోయి ఫైనల్ కు చేరుకోలేకపోయింది. అయితే, 2022లో ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ, శ్రీలంక చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఆసియా కప్‌కు ముందు పాకిస్తాన్ జట్టు అఫ్ఘానిస్తాన్, యూఏఈలతో జరిగే టీ20 ట్రై-సిరీస్‌లో పాల్గొని సన్నద్ధం కానుంది.
ఆసియా కప్ 2025 కోసం పాకిస్తాన్ జట్టు:
సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, ఖుష్దిల్ షా, మహమ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మహమ్మద్ నవాజ్, మహమ్మద్ వసీం జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ మిర్జా, షాహీన్ షా అఫ్రిది, సుఫ్యాన్ మోఖిమ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications