Asia Cup 2025: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఆసియా కప్ 2025 షెడ్యూల్ వెలువడింది. ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. 28వ తేదీన ఫైనల్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ కు ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది.
ఈ విషయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ వెల్లడించింది. ఆసియా కప్ 2025 షెడ్యూల్ ను ఖరారు చేయడానికి ఢాకాలో సమావేశమైంది ఆసియా క్రికెట్ కౌన్సిల్. సుమారు రెండు గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంది.

ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9 నుండి 28 వరకు జరుగనుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా దీన్ని హోస్ట్ చేయనున్నాయి. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 కోసం సన్నాహాలకు అనుగుణంగా ఈ టోర్నమెంట్ అదే ఫార్మాట్‌లో జరుగుతుంది.
ఈ ఎడిషన్‌లో ఎనిమిది జట్లు పాల్గొనబోతోన్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్ కోసం భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్, ఒమన్.. తలపడనున్నాయి. మొత్తం 19 మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉంటాయని భావిస్తున్నారు.
చిరకాల ప్రత్యర్థుల మధ్య మూడు హై-ఓల్టేజ్ మ్యాచ్ లు జరిగే అవకాశం ఉంది. అన్నీ సవ్యంగా సాగితే.. భారత్- పాకిస్తాన్ మధ్య మూడు మ్యాచ్ లు ఉండొచ్చు. గ్రూప్, సూపర్ 4లల్లో భారత్- పాకిస్తాన్ ఎదురుపడొచ్చు. ఈ రెండు జట్లు అంచనాలకు తగ్గట్టుగా రాణించగలిగితే ఫైనల్స్ లో ఢీ కొనడం ఖాయమౌతుంది.
గ్రూప్ ఏ: భారత్, పాకిస్తాన్, యుఎఇ, ఒమన్
గ్రూప్ బీ: శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్
ఆసియా కప్ 2025 పూర్తి షెడ్యూల్..
సెప్టెంబర్ 9 (మంగళవారం): ఆఫ్ఘనిస్తాన్ vs హాంకాంగ్, అబుదాబి
సెప్టెంబర్ 10 (బుధవారం): భారత్ vs యుఏఈ, దుబాయ్
సెప్టెంబర్ 11 (గురువారం): బంగ్లాదేశ్ vs హాంకాంగ్, అబుదాబి
సెప్టెంబర్ 12 (శుక్రవారం): పాకిస్తాన్ vs ఒమన్, దుబాయ్
సెప్టెంబర్ 13 (శనివారం): బంగ్లాదేశ్ vs శ్రీలంక, అబుదాబి
సెప్టెంబర్ 14 (ఆదివారం): భారత్ vs పాకిస్తాన్, దుబాయ్
సెప్టెంబర్ 15 (సోమవారం): యుఎఇ vs ఒమన్, అబుదాబి
సెప్టెంబర్ 15 (సోమవారం): శ్రీలంక vs హాంకాంగ్, దుబాయ్
సెప్టెంబర్ 16 (మంగళవారం): బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్, దుబాయ్
సెప్టెంబర్ 17 (బుధవారం): పాకిస్తాన్ vs యుఎఇ, అబుదాబి
సెప్టెంబర్ 18 (గురువారం): శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్, దుబాయ్
సెప్టెంబర్ 19 (శుక్రవారం): భారత్ vs ఒమన్, అబుదాబి
సెప్టెంబర్ 20 (శనివారం): గ్రూప్ బి క్వాలిఫైయర్ 1 vs గ్రూప్ బి క్వాలిఫైయర్ 2, దుబాయ్
సెప్టెంబర్ 21 (ఆదివారం): గ్రూప్ ఎ క్వాలిఫైయర్ 1 vs గ్రూప్ ఎ క్వాలిఫైయర్ 2, దుబాయ్
సెప్టెంబర్ 22 (సోమవారం): విశ్రాంతి దినం
సెప్టెంబర్ 23 (మంగళవారం): గ్రూప్ ఎ క్వాలిఫయర్ 1 vs గ్రూప్ బి క్వాలిఫయర్ 2, అబుదాబి
సెప్టెంబర్ 24 (బుధవారం): గ్రూప్ బి క్వాలిఫైయర్ 1 vs గ్రూప్ ఎ క్వాలిఫైయర్ 2, దుబాయ్
సెప్టెంబర్ 25 (గురువారం): గ్రూప్ ఎ క్వాలిఫయర్ 2 vs గ్రూప్ బి క్వాలిఫయర్ 2, దుబాయ్
సెప్టెంబర్ 26 (శుక్రవారం): గ్రూప్ ఎ క్వాలిఫైయర్ 1 vs గ్రూప్ బి క్వాలిఫైయర్, దుబాయ్
సెప్టెంబర్ 27 (శనివారం): సెలవు దినం
28 సెప్టెంబర్ (ఆదివారం): ఫైనల్, దుబాయ్