పూర్తిగా ఫిట్‌గా లేని ఆటగాళ్లను ఆసియా కప్‌కు ఎంపిక చేయడంపై వరల్డ్ కప్ హీరో, మాజీ లెజెండ్ మండిపడ్డాడు. అసలు సదరు ప్లేయర్ల పరిస్థితి గురించి ఒక ఐడియా లేకుండా వాళ్లను టీంలోకి ఎలా తీసుకుంటారని నిలదీశాడు. ఈ సెలెక్షన్ ఏమాత్రం బాగలేదని కుండ బద్దలు కొట్టేశాడు.
ఆసియా కప్ జట్టును ప్రకటించే సమయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. శ్రేయాస్ అయ్యర్ పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు చెప్పాడు. అయితే కేఎల్ రాహుల్‌కు చిన్న గాయమైందని, అందుకే బ్యాకప్‌గా సంజూ శాంసన్‌ను ఎంపిక చేశామని చెప్పుకొచ్చాడు. ఈ టోర్నీలో భారత్ ఆడే తొలి మ్యాచ్‌లో రాహుల్ ఆడకపోవచ్చని సమాచారం.

'ఆసియా కప్ ఆరంభంలో రాహుల్ ఫిట్‌గా ఉండకపోవచ్చు. రెండు, లేదా మూడో మ్యాచ్ నుంచి అతను ఆడే అవకాశం ఉంది. తనకు చిన్న గాయమైంది. అంతకుముందు గాయం నుంచి అయితే రాహుల్ కోలుకున్నాడు. ఇది చిన్న సమస్యే. శ్రేయాస్ ఫుల్ ఫిట్‌గా ఉండటం గుడ్ న్యూస్' అని అగార్కర్ అన్నాడు.
ఈ ప్రకటనపై మాజీ లెజెండ్ మదన్ లాల్ మండిపడ్డాడు. ఆసియా కప్ వంటి టోర్నీలో ఇలాంటి గ్యాంబిల్స్ తీసుకోవడం ఏంటని నిలదీశాడు. అసలు రాహుల్‌కు ఏమైందో అయినా అగార్కర్ ప్రకటించి ఉండాల్సిందన్నాడు. కేఎల్ రాహుల్ ఫిట్‌గా ఉన్నాడా? లేదా? అని సెలెక్టర్లు, మేనేజ్‌మెంట్ కచ్చితంగా చెప్పలేని స్థితి ఉందని అభిప్రాయపడ్డాడు.

'రాహుల్ ఫిట్‌గా ఉన్నాడా? లేదా? తనకు ఈ కొత్త గాయం ఏంటి? దాన్ని వాళ్లు స్పెసిఫిక్‌గా చెప్పి ఉండాల్సింది. శ్రేయాస్ అయ్యర్‌ను కూడా తీసుకున్నారు. త ఫిట్‌నెస్ గురించి కూడా కచ్చితంగా ఏం తెలీదు. వాళ్లిద్దరూ కూడా ఎలాంటి కాంపిటీటివ్ క్రికెట్ ఆడలేదు. అలాంటి వాళ్లను ఎలా తీసుకుంటారు' అని మదన్ లాల్ ప్రశ్నించాడు.
'నెట్స్‌లో బ్యాటింగ్ చేయడానికి, మైదానంలో దిగి ఆడటానికి చాలా తేడా ఉంది. కనీసం మ్యాచ్ ఫిట్‌నెస్ ప్రూవ్ చేసుకున్న తర్వాత వాళ్లను టీంకు సెలెక్ట్ చేయాల్సింది' అని ఈ వరల్డ్ కప్ హీరో చెప్పాడు. అయితే అగార్కర్ మాత్రం రాహుల్ రీఎంట్రీపై చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. మరి అతను ఎంత త్వరగా కోలుకుంటాడో చూడాలి.