Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసియా కప్‌లో ఎక్కువ సెంచరీలు చేసిన ప్లేయర్లు.. విరాట్ కోహ్లీ ఎన్నో ప్లేస్‌లో ఉన్నాడు?

ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆసియా కప్ మళ్లీ వచ్చేస్తోంది. ఈ టోర్నీలో భారత్, పాక్ మ్యాచ్ చూడొచ్చని ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. మరి ఇప్పటి వరకు ఆసియా కప్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్లు ఎవరో ఒకసారి చూస్తే..

సనత్ జయసూర్య: వన్డేల్లో ఓపెనర్లు ఎలా ఆడాలనే కొత్త సంప్రదాయం తీసుకొచ్చిన ప్లేయర్ సనత్ జయసూర్య అని చెప్పొచ్చు. ఆసియా కప్‌లో కూడా జయసూర్య డామినేషన్ కొనసాగింది. అతను ఈ టోర్నీలో 25 మ్యాచులు ఆడాడు. వీటిలో ఏకంగా ఆరు సెంచరీలతో చెలరేగాడు.

sanath jayasuriya kumar sangakkara

కుమార సంగక్కర: ఆసియా కప్‌లో అద్భుతంగా రాణించిన మరో లంక ప్లేయర్ కుమార సంగక్కర. ఆట నుంచి తప్పుకున్నా కూడా కానీ ఈ టోర్నీలో సంగక్కర రికార్డును కూడా ఎవరూ బ్రేక్ చేయలేకోయారు. అతను ఈ టోర్నీలో 21 మ్యాచులు ఆడి, నాలుగు సెంచరీలు చేశాడు.

Who scored most centuries in this tournament

విరాట్ కోహ్లీ: టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ కూడా ఆసియా కప్ అంటే చాలు రెచ్చిపోతాడు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో 11 మ్యాచులు ఆడిన కోహ్లీ.. మూడు సెంచరీలతో రాణించాడు. అంతేకాదు ఓవరాల్‌గా 61.30 సగటుతో 613 పరుగులు చేశాడు. అతని బెస్ట్ స్కోరు 183 పరుగులు కావడం గమనార్హం.

Who scored most centuries in this tournament

షోయబ్ మాలిక్: పాకిస్తాన్ వెటరన్ షోయబ్ మాలిక్ కూడా ఆసియా కప్‌లో అదరగొట్టిన వాడే. అతను ఈ టోర్నీలో 17 మ్యాచులు ఆడి 65.50 సగటుతో 786 పరుగులు చేశాడు. వీటిలో మూడు శతకాలు ఉండట అంటే మాటలు కాదు.

లాహిరు తిరుమానే: ఆసియా కప్‌లో ఆకట్టుకున్న మరో శ్రీలంక ప్లేయర్ లాహిరు తిరిమానే. తను ఇప్పటి వరకు ఆసియా కప్‌లో కేవలం 8 మ్యాచులే ఆడాడు. ఈ మ్యాచులు అన్నింటిలో కలిపి 363 పరుగులు చేశాడు. వీటిలో రెండు శతకాలు ఉండటం గమనార్హం.

Who scored most centuries in this tournament

శిఖర్ ధవన్: టీమిండియా తరఫున ఆసియా కప్‌లో రాణించిన మరో ప్లేయర్ శిఖర్ ధవన్. ఈ టోర్నీలో 9 మ్యాచులు ఆడిన ధవన్ 59.33 సగటుతో 534 పరుగులు చేశాడు. అతని అత్యుత్తమ స్కోరు 127గా ఉంది. ఆసియా కప్‌లో ధవన్ రెండు శతకాలు నమోదు చేశాడు.

Who scored most centuries in this tournament

సురేష్ రైనా: ఆసియా కప్‌లో గుర్తుపెట్టుకోవాల్సిన మరో టీమిండియా వెటరన్ సురేష్ రైనా. ఆట నుంచి తప్పుకున్నా కూడా ఎవరూ ఇప్పటి వరకు రాలేదు. ఈ టోర్నీలో 13 మ్యాచులు ఆడిన రైనా రెండు శతకాలు బాదాడు. అంతేకాదు, ఏకంగా 60.77 సగటుతో 547 పరుగులు కూడా చేశాడు.

Story first published: Friday, August 18, 2023, 13:49 [IST]
Other articles published on Aug 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+