ధోనీ కాదు.. డెత్ ఓవర్లలో అతన్ని ఆపడం అసాధ్యమన్న కోహ్లీ.. ఎవరో తెలుసా?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంత విధ్వంసకర బ్యాటర్ అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అతను కనుక చివరి వరకు క్రీజులో ఉంటే ఎంత స్కోరైనా చేయగలడు. ముఖ్యంగా 2017లో ఓపెనర్‌గా ప్రమోషన్ దొరికిన తర్వాత అతనికి ఆటతీరు పూర్తిగా మారిపోయింది. ఈ క్రమంలోనే 2019 వరల్డ్ కప్‌లో రోహిత్ చెలరేగాడు. ఇప్పుడు కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు.
ప్రస్తుతం ఆసియా కప్‌లో టాప్ స్కోరర్‌గా ఉన్న రోహిత్ శర్మ గురించి వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. పాకిస్తాన్‌పై రోహిత్ చేసిన హాఫ్ సెంచరీ గురించి అశ్విన్ మాట్లాడాడు. ఈ సందర్భంగా రోహిత్ గురించి టీమిండియా సూపర్ స్టార్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలను బయటపెట్టాడు. ఒక మ్యాచ్‌లో రోహిత్ క్రీజులో ఉండగా.. అతని బ్యాటింగ్ గురించి కోహ్లీ, అశ్విన్ మాట్లాడుకున్నారట.

'ఐదారేళ్ల క్రితం అనుకుంటా.. రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతని గురించి నేను, కోహ్లీ మాట్లాడుకున్నాం. రోహిత్‌ను చూసి అసలు అతన్ని ఆపాలంటే ఎక్కడ బౌలింగ్ చేయాలి? అని ఆలోచిస్తున్నా. ఒక 15-20 ఓవర్లపాటు రోహిత్ కనుక సెట్ అయితే.. తనకు ఎలా బౌలింగ్ చేయాలో కూడా ఎవరూ ఊహించలేరు. నేను ఇలా ఆలోచిస్తుంటే.. డెత్ ఓవర్లలో ఒక కెప్టెన్‌కు భయంకరమైన పీడకల ఎవరో తెలుసా? అని కోహ్లీ అడిగాడు' అని అశ్విన్ వెల్లడించాడు.
'కోహ్లీ ప్రశ్నకు కొంచెం ఆలోచించి ధోనీనా? అన్నా. కాదు రోహిత్ అని కోహ్లీ చెప్పాడు. అదేంటి? అని అడిగితే.. అసలు రోహిత్‌ను ఆపడానికి ఎక్కడ బౌలింగ్ చేయాలో కూడా ఎవరికీ తెలియదు అని కోహ్లీ వివరించాడు' అని అశ్విన్ ఆ నాటి సంభాషణను గుర్తుచేసుకున్నాడు. చివరి వరకు క్రీజులో ఉంటే రోహిత్ ఎంతటి విధ్వంసం సృష్టించగలడో 2014లో అతను బాదిన 264 పరుగుల ఇన్నింగ్స్ అందరికీ చూపించింది.

దీని గురించి మాట్లాడిన అశ్విన్.. రోహిత్ దగ్గర అన్ని రకాల షాట్లు ఉన్నాయని చెప్పాడు. 'రోహిత్ కనుక టీ20ల్లో 16వ ఓవర్ చివర్లో ఆడుతుంటే తనకు ఎలా బౌలింగ్ చేయాలి? ఎక్కడ వేసినా అతను బాదేస్తాడు. క్రికెట్‌లో ఉన్న అన్ని షాట్లు రోహిత్ దగ్గర ఉన్నాయి. చిన్నస్వామిలో ఒకసారి రోహిత్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్‌ను కోహ్లీ ఎప్పటికీ మర్చిపోలేడట. రోహిత్ ఆడే షాట్లు చూస్తే.. ఆట ఇంత ఈజీనా? అనిపిస్తుంది' అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications