Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: పాక్‌పై కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్.. ఆ రోజు తన ఫీలింగ్స్ ఏంటో చెప్పిన కింగ్!

టీమిండియా ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు ఆసియా కప్ కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడెప్పుడా? అని వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆసియా కప్‌లో అంతకుముందు భారత్, పాక్ తలపడిన మ్యాచుల గురించి క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ కూడా తన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు.

2012 ఆసియా కప్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ కనబరిచాడు. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ లక్ష్య ఛేదనలో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో 183 పరుగులు చేసి భారత్‌ను విజయానికి చేరువ చేశాడు. ఈ ఇన్నింగ్స్ ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్‌కు ఫేవరెట్. దీన్ని తాజాగా గుర్తుచేసుకున్న కోహ్లీ.. ఆ రోజు తను వేరే లెవెల్‌లో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.

Asia Cup 2023 Virat Kohli talks about greatest INDvsPAK knock

ఈ మ్యాచ్‌లో పాక్ 329/6 స్కోరు చేసింది. ఆ టీం ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఈ ఛేజ్‌లో టీమిండియా ఓపెనర్ గౌతం గంభీర్ డకౌట్ అయ్యాడు. ఇలాంటి సమయంలో సచిన్ టెండూల్కర్ (52)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ (68)తో కూడా మంచి పార్టనర్‌షిప్ నమోదు చేశాడు. దీంతో భారత జట్టు కమాండిగ్ పొజిషన్‌కు చేరింది.

ఆ రోజు ఆటలో స్పెసిఫిక్‌గా ఏం చేయాలని తాను అనుకోలేదని కోహ్లీ చెప్పాడు. ఇన్‌స్టింక్ట్ మీద ఆధారపడి ఆడానన్నాడు. 'ఒక ఇన్నింగ్స్‌లో.. అదీ ఛేజింగ్‌లో అంత స్కోరు చేస్తానని కలలో కూడా అనుకోలేదు. ఆ రోజు నేను పూర్తిగా డిఫరెంట్ జోన్‌లో ఉన్నా. ఎలాంటి ప్లాన్ కూడా లేదు. జస్ట్ ఇన్‌స్టింక్ట్ మీద ఆధారపడి బ్యాటింగ్ చేశా. మ్యాచ్ జరిగే కొద్దీ నా జోన్ బలంగా మారింది' అని కోహ్లీ వెల్లడించాడు.

'ఆ రోజు నన్ను నేనే సర్‌ప్రైజ్ చేసుకున్నానని అనిపించింది. నేను సెంచరీలు చేయగలను అని అనుకునే వాడిని. అలాంటిది 180 పరుగులు చేయడం నాకు చాలా గొప్ప విషయం. అదీ పాకిస్తాన్ వంటి ప్రత్యర్థిపై. ఆ గేమ్‌ మాకు చాలా ముఖ్యం కూడా' అని కోహ్లీ గుర్తుచేసుకున్నాడు. కోహ్లీ తర్వాత రైనా (12 నాటౌట్), ధోనీ (4 నాటౌట్) కలిసి ఆ మ్యాచ్‌ను ముగించారు.

Story first published: Monday, August 28, 2023, 14:39 [IST]
Other articles published on Aug 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+