Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసియా కప్‌లో టాప్ వికెట్ టేకర్లు.. టాప్-5లో ఒక్క ఇండియన్ కూడా లేడుగా..!

ప్రస్తుతం ఆసియా క్రికెట్ టీమ్స్ అన్నీ కూడా ఆసియా కప్ కోసం రెడీ అవుతున్నాయి. ఈ నెలాఖరు నుంచి ఈ టోర్నీ మొదలవుతుంది. మరి ఇలాంటి సమయంలో ఆసియా కప్ హిస్టరీలో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ల వివరాలు చూస్తే వీరిలో ఎక్కువ మంది శ్రీలంక బౌలర్లే ఉన్నారు.

ముత్తయ్య మురళీధరన్:శ్రీలంక లెజెంబ్ మురళీధరన్ ఈ లిస్టులో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. అతను ఆసియా కప్‌లో 24 మ్యాచులు ఆడాడు. వీటిలో 30 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకసారి ఐదు వికెట్ల హాల్ తీసుకున్నాడు.

Asia Cup 2023 top five wicket takers of the tournament

లసిత్ మలింగ:ఆసియా కప్‌ హిస్టరీలో రెండో టాప్ వికెట్ టేకర్ కూడా శ్రీలంక నుంచే ఉండటం గమనార్హం. శ్రీలంక లెజెండ్ లసిత్ మలింగ ఈ టోర్నీ చరిత్రలో 14 మ్యాచులు ఆడి, 29 వికెట్లు తీసుకున్నాడు. అంతేకాదు మూడుసార్లు ఐదు వికెట్ల హాల్ తీసుకున్నాడు.

అజంతా మెండిస్:ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు తీసుకున్న మూడో బౌలర్ కూడా శ్రీలంక ప్లేయరే కావడం విశేషం. లంక స్పిన్ మెజీషియన్ అజంతా మెండిస్ ఈ టోర్నీలో 8 మ్యాచులు ఆడాడు. వీటిలో రెండు సార్లు ఐదు వికెట్ల హాల్ తీసుకున్న మెండిస్.. ఓవరాల్‌గా 26 వికెట్లతో ఆకట్టుకున్నాడు.

సయీద్ అజ్మల్:పాక్ లెజెండరీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ కూడా ఆసియా కప్‌లో ఆకట్టుకున్నాడు. మొత్తం 12 మ్యాచులు ఆడిన అతను 25 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

చమిండా వాస్:ఆసియా కప్‌లో టాప్ వికెట్ టేకర్ల టాప్-5 బౌలర్లలో నలుగురు శ్రీలంక వాళ్లే కావడం గమనార్హం. ఈ లిస్టులో ఐదో ప్లేయర్ లంక పేసర్ చమిండా వాస్. అతను 19 మ్యాచుల్లో 23 వికెట్లు తీసుకున్నాడు.

ఇర్ఫాన్ పఠాన్:ఇక టాప్-5లో చోటు దక్కకపోయినా ఆసియా కప్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఇండియన్ బౌలర్ ఎవరంటే ఇర్ఫాన్ పఠాన్ పేరు చెప్పాల్సిందే. ఈ టోర్నీలో 12 మ్యాచులు ఆడిన పఠాన్ 22 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

Story first published: Saturday, August 19, 2023, 17:25 [IST]
Other articles published on Aug 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+