Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2023 : లక్‌తో ఛాన్స్ కొట్టేసిన ప్లేయర్స్.. ఆసియా కప్‌ టీంలో వీళ్లు వేస్ట్!

ఆసియా కప్ కోసం ఎవరిని ఎంపిక చేస్తారా? అనే టెన్షన్‌కు బీసీసీఐ తెరదించింది. మొత్తం 15 మందితో భారత బృందాన్ని ప్రకటించింది. అయితే ఇది చూసిన వాళ్లు చాలా మంది ఆశ్చర్యపోయారు. ఈ టీంలో చోటు దక్కించుకున్న కొందరు లక్‌తో ఛాన్స్ కొట్టేశారని అంటున్నారు. వాళ్లెవరంటే..

తిలక్ వర్మ
తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు కూడా ఆసియా కప్‌కు సెలెక్టర్లు ఎంపిక చేశారు. చూడటానికి ఇది చాలా ఎగ్జయిటింగ్ వార్తలా కనిపిస్తోంది. లిస్ట్-ఎ క్రికెట్‌లో తిలక్ రాణించాడు. అరంగేట్రంలో అందర్నీ ఆకట్టుకున్నాడు కూడా.

 Asia Cup 2023

లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ కావడం, అవసరమైతే బౌలింగ్ కూడా చేయగలగడం తిలక్‌కు ప్లస్ పాయింట్స్. కానీ అతనికి ఇదే తొలి వన్డే సిరీస్ అని మర్చిపోకూడదు. దానికితోడు దేశవాళీల్లో తిలక్ ఫిట్‌నెస్ కూడా అంత గొప్పగా లేదు.

అలాగే హార్డ్ లెంగ్త్ డెలివరీలు ఎదుర్కోవడంలో తిలక్ తడబాటు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఏం చూసి అతన్ని టీంలోకి తీసుకున్నారనేది పెద్ద మిస్టరీగా కనిపిస్తోంది.

మహమ్మద్ షమీ
ఈ వెటరన్ పేసర్ ఈసారి ఐపీఎల్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌లో షమీ అంత గొప్ప ప్రదర్శన చేయలేదు. ఆడిన 8 వన్డేల్లో కలిపి కేవలం 10 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత మళ్లీ మైదానంలోకి కూడా అడుగు పెట్టలేదు.

ఇప్పుడు అనూహ్యంగా ఆసియా కప్‌ టీంలో చోటు దక్కించుకున్నాడు. గత రెండేళ్లుగా ఈ ఫార్మాట్‌లో షమీ సగటు అంత గొప్పగా లేదు. అయినా సరే అతన్ని ఆసియా కప్‌కు ఎంపిక చేయడం నిజంగా అదృష్టమనే చెప్పాలి.

సూర్యకుమార్ యాదవ్
వన్డే ఫార్మాట్‌లో ఏమాత్రం రాణించని ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్. తను ఆడిన 26 మ్యాచుల్లో 511 పరుగులే చేశాడీ టీ20 స్టార్. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీసులో వరుసగా గోల్డెన్ డక్‌లు నమోదు చేశాడు కూడా. ఈ ఏడాది ఓవరాల్‌గా 10 వన్డేలు ఆడిన సూర్య 127 పరుగులు చేశాడు.

అతని బెస్ట్ స్కోరు 35 పరుగులు. ఇలాంటి గణాంకాలతో అతన్ని ఆసియా కప్‌కు ఎందుకు ఎంపిక చేశారనేది సెలెక్టర్లే చెప్పాలి. అయితే పొట్టి ఫార్మాట్‌లో రాణించినట్లే వన్డేల్లోనూ అతను రాణిస్తాడని సెలెక్టర్లు నమ్ముతున్నారు.

Story first published: Tuesday, August 22, 2023, 7:46 [IST]
Other articles published on Aug 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+