For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Asia Cup 2023: ‘నాగిని డ్యాన్స్’ చేసింది లంకేయులే.. ఫస్ట్ మ్యాచ్‌లో బంగ్లా చిత్తు!

డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక ఆసియా కప్‌ 2023ను కాన్ఫిడెంట్‌గా ఆరంభించింది. పల్లెకెలె వేదికగా జరిగిన తమ మొదటి మ్యాచ్‌లో లంకేయులు బంగ్లా టైగర్స్‌ను ఎదుర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ ముందుగా బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. డ్రై పిచ్‌పై భారీ స్కోరు చేసి లంక టీంపై ఒత్తిడి పెంచాలన్నది అతని ఆలోచన. కానీ శ్రీలంక బౌలర్లు అద్భుతమైన ప్రదర్శనతో ఈ ప్లాన్‌పై నీళ్లు చల్లారు.

లంక స్పిన్నర్ తీక్షణ, యంగ్ పేసర్ పతిరాణా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా పతిరాణా ఏకంగా నాలుగు వికెట్లు తీసుకొని చెలరేగాడు. దీంతో బంగ్లా టీం ఏ దశలోనూ భారీ స్కోరు దిశగా సాగలేదు. కేవలం నజ్ముల్ షాంటో (89) మాత్రమే ఒంటరి పోరాటం చేశాడు. బంగ్లా టీంలో ఏడుగురు ప్లేయర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరారు. అంటే వాళ్ల బ్యాటింగ్ ఎంత పేలవంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

Srilanka defeats Bangladesh in their first Asia Cup 2023 match

ఈ క్రమంలో బంగ్లాను 164 పరుగులకు శ్రీలంక బౌలర్లు ఆలౌట్ చేశారు. ఈజీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో లంకను కూడా బంగ్లా బౌలర్లు ఇబ్బంది పెట్టారు. ఛేజ్ ఆరంభంలోనే బంగ్లాదేశ్ పేసర్ టస్కిన్ అహ్మద్.. లంకకు షాకిచ్చాడు. కరుణరత్నే (1)ని క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే కుశాల్ మెండిస్ (5) కూడా పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ నిస్సంక (14) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు.

ఇలాంటి సమయంలో లంక మిడిలార్డర్ ఆ టీంను ఆదుకుంది. ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్న సమర విక్రమ (54) అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. అతనికి చరిత్ ఆశలంక (62 నాటౌట్) చక్కని సహకారం అందించాడు. సమరవిక్రమ అవుటైన తర్వాత ధనంజయ డిసిల్వ (2) కూడా విఫలమయ్యాడు. దీంతో లంక ఫ్యాన్స్‌లో కొంత టెన్షన్ నెలకొంది.

Srilanka defeats Bangladesh in their first Asia Cup 2023 match

అలాంటి సమయంలో కెప్టెన్ దాసున్ షనక (14 నాటౌట్) సమయోచితంగా ఆడి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఆశలంక, షనక కలిసి శ్రీలంకను విజయతీరాలకు చేర్చారు. బంగ్లా నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని 39 ఓవర్లలో ఛేదించిన లంక.. ఆసియా కప్ 2023ను విజయంతో ఆరంభించింది. బంగ్లా బౌలర్లలో కెప్టెన్ షకీబల్ హసన్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. టస్కిన్ అహ్మద్, మెహదీ హసన్, షోరిఫుల్ ఇస్లామ్ తలో వికెట్ తీసుకున్నారు.

Story first published: Thursday, August 31, 2023, 22:05 [IST]
Other articles published on Aug 31, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+