Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2023: చరిత్ర సృష్టించిన శ్రీలంక.. అరుదైన రికార్డుతో ఆసీస్‌ను కూడా దాటేసిందిగా!

ఆసియా కప్ 2023లో తొలి మ్యాచ్ ఆడుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ పెద్దగా రాణించలేదు. లంక బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాటర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా కుర్ర పేసర్ మతీష్ పతిరాణా ఏకంగా నాలుగు వికెట్లతో ఆసియా కప్ అరంగేట్రంలో అదరగొట్టాడు. అతనితోపాటు తీక్షణ కూడా రెండు వికెట్లతో రాణించాడు.

లంక బౌలర్లు రాణించడంతో బంగ్లాదేశ్ జట్టు అనుకున్న స్కోరు చేయలేకపోయింది. కేవలం 164 పరుగులకే బంగ్లా ఆలౌట్ అయింది. దీంతో పల్లెకెలె పిచ్‌ను చూసిన తర్వాత లంక ముందు భారీ స్కోరు ఉంచాలని అనుకున్న బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ ఆలోచన దెబ్బతిన్నది. అయితే ఈ మ్యాచ్‌లో లంక అరుదైన రికార్డు సాధించింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి బలమైన జట్లను దాటేసింది.

Srilanka creates history in ODI format

ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే?.. లంక జట్టు వరుసగా 11 మ్యాచుల్లో ప్రత్యర్థి టీంను ఆలౌట్ చేసింది. ఇప్పటి వరకు మరే జట్టు ఈ రికార్డు సాధించలేదు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల పేరున ఉండేది. ఈ రెండు టీమ్స్ ఏకంగా 10 మ్యాచుల్లో వరుసగా తమ ప్రత్యర్థులను ఆలౌట్ చేశారు. ఇప్పుడు లంక వరుసగా 11 మ్యాచుల్లో ఈ ఫీట్ సాధించింది.

పురుషుల వన్డే క్రికెట్‌ చరిత్రలో ఇలా వరుసగా 11 మ్యాచుల్లో ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన ఏకైక టీంగా శ్రీలంక నిలిచింది. తమ టీం ఈ అరుదైన ఘనత సాధించడంపై లంక ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బలమైన బౌలింగ్ ఎటాక్ ఉన్న శ్రీలంకకు ఇది మంచి రికార్డే అని అంటున్నారు. మరికొందరు మాత్రం పిల్లదేశాలపై శ్రీలంక ఈ రికార్డు సాధించిందని, బలమైన టీమ్స్‌పై కాదని విమర్శిస్తున్నారు. ఏదైనా ఈ రికార్డును మాత్రం గౌరవించాలని మరికొందరు ఫ్యాన్స్ అంటున్నారు.

Story first published: Thursday, August 31, 2023, 21:10 [IST]
Other articles published on Aug 31, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+