Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2023: లక్కీగా సెలెక్ట్ అయింది తిలక్ కాదు.. సన్‌రైజర్స్ మాజీ కోచ్ కీలక వ్యాఖ్యలు!

ఆసియా కప్‌ ఆడే భారత జట్టులో తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. ఇది చూసిన అందరూ కూడా తిలక్‌కు అదృష్టం కలిసొచ్చిందని అన్నారు. అయితే ఇది చాలా ధైర్యంగా తీసుకున్న నిర్ణయమని, తిలక్ చాలా ట్యాలెంట్ ఉన్న ప్లేయర్ అని సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కోచ్, ఆసీస్ లెజెండ్ టామ్ మూడీ అన్నాడు.

టీమిండియాలో ఐదు లేదా ఆరు స్థానాల్లో తిలక్ చక్కగా రాణిస్తాడని మూడీ అభిప్రాయపడ్డాడు. 'ఇది నిజంగా అద్భుతమైన తెలివైన నిర్ణయం. తిలక్ ఎదుగుతున్న ప్లేయర్. కేవలం స్కిల్స్ మాత్రమే కాదు మంచి టెంపర్‌మెంట్ ఉన్న ఆటగాడు. దానికితోడు టాపార్డర్‌లో ఎడం చేతి వాటం బ్యాటర్లు ఉండటం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే' అని చెప్పాడు.

asia-cup-2023-srh-former-coach-says-tilak-varma-did-not-get-lucky

ఇలాంటి సమయంలో తిలక్‌ను ఐదు లేదా ఆరు స్థానాల్లో ఆడిస్తే చాలా బాగుటుందని మూడీ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా స్పిన్ ఎదుర్కోవడంలో జట్టుకు బ్యాలెన్స్ వస్తుందని చెప్పాడు. అదే సమయంలో తిలక్ కేవలం లక్కీగా జట్టులోకి ఎంపిక కాలేదని స్పష్టం చేశాడు. లక్కీగా సెలెక్ట్ అయింది సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.

'నన్నడిగితే లక్కీగా సెలెక్ట్ అయింది సూర్యకుమార్ యాదవ్. తను టీ20ల్లో చాలా మంచి ప్లేయర్. దాన్ని ఎవరూ కాదనరు. కానీ వన్డే ఫార్మాట్‌ను తను ఇంకా క్రాక్ చేయలేదు. ఇప్పటికి సూర్య 20పైగా మ్యాచులు ఆడాడు. కానీ వాటిలో దేనిలో పెద్దగా రాణించలేదు. అతని స్థానంలో మరొక ట్యాలెంట్ ఉన్న ప్లేయర్‌ను ఎంపిక చేయాల్సింది' అని మూడీ తెలిపాడు.

ఈ టీంలో సూర్యను తీసుకోకుండా అతని స్థానాన్ని జైస్వాల్ వంటి కుర్ర ప్లేయర్‌కు ఇవ్వాల్సిందని మూడీ చెప్పాడు. లేదంటే మరొక రిస్ట్ స్పిన్నర్‌ను తీసుకున్నా బాగుండేదని అభిప్రాయపడ్డాడు. వన్డేల్లో ఇటీవలే ఆస్ట్రేలియాపై సూర్యకుమార్ వరుసగా మూడు మ్యాచుల్లో గోల్డెన్ డక్‌లు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, August 22, 2023, 13:34 [IST]
Other articles published on Aug 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+