Asia Cup 2023: పోరాడిన సమర విక్రమ.. బంగ్లా ముందు ఫైటింగ్ టార్గెట్!
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్ సదీర సమరవిక్రమ అద్భుతమైన పోరాటం కనబరిచాడు. ఆరంభం నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన శ్రీలంకకు మంచి స్కోరు అందించాడు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నాడు.
బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో శ్రీలంక ఓపెనర్లు ధాటిగా ఆడలేకపోయారు. ఈ క్రమంలోనే దిముత్ కరుణరత్నే (18) స్వల్పస్కోరుకే పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్ పాథుమ్ నిస్సంక (40)తో కలిసిన కుశాల్ మెండిస్ (50) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే వీళ్లిద్దరూ చాలా నిదానంగా ఆడటంతో స్కోరుబోర్డు నత్తనడకన ముందుకు సాగింది.

ఇక హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే గేరు మార్చేందుకు ప్రయత్నించిన మెండిస్.. ర్యాంప్ షాట్ ఆడబోయి థర్డ్ మ్యాన్‌కు చిక్కాడు. ఇలాంటి సమయంలో సదీర సమరవిక్రమ (93) అద్భుతంగా ఆడాడు. మిగతావారితో పోలిస్తే చాలా వేగంగా పరుగులు చేస్తూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. కానీ అతనికి చివర్లో ఆశించినంత సహకారం దక్కలేదు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న చరిత్ ఆశలంక (10), ధనంజయ డిసిల్వ (6) ఇద్దరూ విఫలమయ్యారు.
ఇక చివర్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ దాసున్ షనక (24) క్రీజులో కుదురుకున్నట్లే కనిపించాడు. కానీ అనవసరమైన షాట్‌కు ప్రయత్నించి బంతిని వికెట్ల మీదకు ఆడుకున్నాడు. చివర్లో దునిత్ వెల్లలిగె (3), మహీష్ తీక్షణ (2) కూడా కనీస సహకారం అందించలేదు. దీంతో తనే భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించిన సమరవిక్రమ.. ఇన్నింగ్స్ చివరి బంతికి 93 పరుగుల వద్ద అవుటయ్యాడు.
సమర విక్రమ అద్వితీయ పోరాటంతో శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ఈ పిచ్‌పై ఇది మంచి స్కోరే. కానీ వర్షం పడే అవకాశం ఉండటంతో ఇది సరిపోతుందా? అనేది అనుమానమే. ఇక బౌలింగ్‌లో బంగ్లా పేసర్లు అద్భుతంగా రాణించారని చెప్పాలి. హసన్ మహమూద్, టస్కిన్ అహ్మద్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. షోరిఫుల్ ఇస్లాం రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications