Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2023: సచిన్‌లా ఆడబోయి వికెట్ పారేసుకున్నాడు.. శ్రీలంక బ్యాటర్‌పై ఫ్యాన్స్ జోకులు!

క్రికెట్‌లో బ్యాటర్లు రకరకాల షాట్లు ఆడతారు. అయితే కొన్ని మాత్రమే వారి స్పెషల్ షాట్లుగా మిగిలిపోతాయి. వాటిని అందరూ ఆడినా.. సదరు బ్యాటర్ ఆడినంత పర్‌ఫెక్ట్‌గా ఆడలేరన్నమాట. ఆఫ్‌సైడ్ వచ్చిన షార్ట్ బాల్స్‌ను దాదాపు వదిలేస్తారు. కానీ సచిన్, సెహ్వాగ్ వంటి వాళ్లు మాత్రం.. ఈ బంతిని కూడా బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించేవాళ్లు.

భుజాలు కొంచెం లూజ్ చేసి.. ఆ షార్ట్ బాల్‌ను థర్డ్ మ్యాన్ మీదుగా లేదంటే కీపర్ తలమీదుగా వెనక్కు పంపేవాళ్లు. సరిగ్గా అలాంటి షాటే ఆడేందుకు ప్రయత్నించిన శ్రీలంక స్టార్ కుశాల్ మెండిస్ తడబడ్డాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంక కొంత తడబడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టుకు అనుకున్న ఆరంభం దక్కలేదు.

Asia Cup 2023

ఇలాంటి సమయంలో కుశాల్ మెండిస్ (50) అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. జాగ్రత్తగా ఇన్నింగ్స్ నిర్మించి, జట్టుకు మంచి స్కోరు అందించాడు. అయితే హాఫ్ సెంచరీ పూర్తయిన తర్వాత నాలుగో బంతికే పెవిలియన్ చేరాడు. షోరిఫుల్ ఇస్లాం వేసిన షార్ట్ బాల్‌ను థర్డ్ మ్యాన్ మీదుగా పంపడానికి ర్యాంప్ షాట్ ఆడాడు.

కానీ అది సరిగా కనెక్ట్ కాలేదు. దీంతో థర్డ్ మ్యాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న టస్కిన్ అహ్మద్ దాన్ని చటుక్కున పట్టేశాడు. ఇది చూసిన కుశాల్ మెండిస్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపటికే మరో కీలక బ్యాటర్ చరిత్ ఆశలంక (10) కూడా మైదానం వీడాడు. టస్కిన్ అహ్మద్ వేసిన స్లో డెలివరీని ఆశలంక అంచనా వేయలేకపోయాడు. ఈ క్రమంలో మిడాన్ మీదుగా బంతిని బాదేందుకు అతను ప్రయత్నించాడు.

కానీ స్లో బాల్ కావడంతో అది అంత ఎత్తుకు ఎగర్లేదు. దీంతో మిడాన్‌లో ఉన్న కెప్టెన్ షకీబల్ హసన్ వేగంగా పరిగెత్తుకొచ్చి క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఆశలంక కూడా మైదానం వీడాడు. ఇలా వరుసగా రెండు కీలక వికెట్లు కోల్పోయిన శ్రీలంక ఇంకా పోరాడుతూనే ఉంది. వర్షం పడే అవకాశం ఉండటంతో ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు చేసి బంగ్లాను ఒత్తిడిలోకి నెట్టాలని లంకేయులు భావిస్తున్నారు.

మెండిస్ వికెట్ పోవడం లంకేయులపై బాగా ప్రభావం చూపింది. దీనిపై స్పందించిన ఫ్యాన్స్.. అందరూ ఇలాంటి షాట్లు ఆడలేరని ట్రోల్ చేస్తున్నారు. మరి మిగతా శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఆడుతుందో చూడాలి. కాగా, డ్రింక్స్ సమయానికి వాళ్లు 34 ఓవర్లలో 150/4 స్కోరుతో ఉన్నారు.

Story first published: Saturday, September 9, 2023, 17:40 [IST]
Other articles published on Sep 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+