Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shubman Gill:పాకిస్తాన్ పై చెత్త బ్యాటింగ్ చేశా..!

ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాక్ హై ఓల్టేజ్ మ్యాచ్‌లో అట్టర్ ఫ్లాప్ అయిన టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ సోమవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో దుమ్మురేపాడు. తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాచ్ విన్నింగ్ గేమ్ ఆడిన గిల్... పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌తో నిరాశపర్చినట్లు చెప్పుకొచ్చాడు.

సోమవారం భారత్ నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వర్షం అడ్డంకిగా మారింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ద్వారా మ్యాచ్‌ను టీమిండియా గెలిచింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్‌కు 23 ఓవర్లకు గాను 145 పరుగులు చేయాల్సి ఉండగా ఇద్దరు ఓపెనర్లు గిల్, రోహిత్ శర్మ చెరో అర్థసెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. దీంతో గ్రూప్ ఏ‌లో భారత్ మూడు పాయింట్లతో సూపన్‌ ఫోర్‌లోకి ఎంటర్ కాగా, నేపాల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Asia cup 2023:Shubman Gill Opens Up From Disappointment to Redemption Against Nepal

ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ...పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తన ఆటతీరు బాగాలేదని చెప్పాడు.ఇక నేపాల్‌తో జరిగిన మ్యాచ్ గెలవాల్సిన మ్యాచ్ కావడంతో రోహిత్‌తో కలిసి చక్కటి ఆటతీరును కనబర్చినట్లు చెప్పాడు. రోహిత్ శర్మ షాట్లు చూడముచ్చటగా ఉంటాయని శుభ్‌మన్ గిల్ కితాబిచ్చాడు. ఇక నేపాల్ బౌలర్లపై గిల్ ప్రశంసల వర్షం కురిపించాడు.

కొత్త బంతితో నేపాల్ బౌలర్లు తమ సహనాన్ని పరీక్షించారని గిల్ చెప్పుకొచ్చాడు.అయితే వర్షం కారణంగా బంతి తడిగా మారడంతో మ్యాచ్ తమవైపు మొగ్గుతుందని ఊహించినట్లు చెప్పాడు. అనుకున్నట్లుగానే మ్యాచ్ తమ చేతుల్లోకి వెళ్లిపోయిందని గుర్తుచేశాడు. ఇదిలా ఉంటే భారత్ గ్రూప్‌ ఏలో మూడు పాయింట్లతో సూపర్ ఫోర్‌కు ఎంట్రీ ఇవ్వగా పాకిస్తాన్ ముందుగానే చేరింది. సెప్టెంబర్ 10వ తేదీన పాక్‌తో మరోసారి భారత్ తలపడుతుంది. ఎలాంటి పాయింట్లు లేకుండా నేపాల్ టోర్నీ నుంచి నిష్క్రమించగా... ఈ టోర్నీ నుంచి పలు మధుర జ్ఞాపకాలను తమ వెంట తీసుకెళ్లింది.

Story first published: Tuesday, September 5, 2023, 11:53 [IST]
Other articles published on Sep 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+