టీమిండియా ఆసియా కప్ జట్టును ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాల్గొన్నాడు. ఈ క్రమంలో రోహిత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వన్డే వరల్డ్ కస్‌లో తను, విరాట్ కోహ్లీ కూడా బౌలింగ్ చేస్తే బాగుంటుందని రోహిత్ చెప్పాడు.
ఆసియా కప్ కోసం మొత్తం 17 మందితో కూడిన బృందాన్ని బీసీసీఐ ప్రకటించింది. వీరిలో కేవలం ఒక్క స్పెషలిస్టు స్పిన్నర్‌కు మాత్రమే చోటు దక్కింది. కుల్దీప్ యాదవ్ మాత్రమే ఈ టీంకు ఎంపికయ్యాడు. దీంతో జట్టులో స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ లేకపోవడాన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన రోహిత్.. సరదా వ్యాఖ్యలు చేశాడు.

'వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా కొన్ని ఓవర్లు బౌలింగ్ చేస్తారని ఆశిస్తున్నాం' అంటూ రోహిత్ నవ్వేశాడు. ఈ మాటలు విన్న వాళ్లు కూడా తమ నవ్వును దాచుకోలేకపోయారు. ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి వన్డే వరల్డ్ కప్ మొదలవుతుందన్న సంగతి తెలిసిందే. గత వరల్డ్ కప్ ఫైనల్‌లో తలపడిన ఇంగ్లండ్, న్యూజిల్యాండ్ జట్ల మధ్యనే తొలి మ్యాచ్ జరుగుతుంది.
అదే నెల 8వ తేదీన భారత జట్టు తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఇక ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టులో భారత సెలెక్టర్లు సూర్యకుమార్ యాదవ్‌కు ఓటేశారు. వన్డేల్లో అతను చెత్త ఫామ్ కనబరిచినా కూడా.. సూర్యపై నమ్మకం ఉంచారు. అలాగే తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు కూడా అవకాశం ఇచ్చారు.
అయితే వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు ఈ జట్టులో అవకాశం దక్కలేదు. కుల్దీప్ యాదవ్ ఒక్కడే స్పెషలిస్టు స్పిన్నర్‌గా ఎంపికయ్యాడు. అతనితోపాటు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఇద్దరూ స్పిన్ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు.