Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rohit Sharma: మేం ఏమైనా పిచ్చివాళ్లమా?.. రోహిత్ దెబ్బకు వణికిపోయిన రిపోర్టర్లు!

ఆసియా కప్ కోసం బలమైన బృందాన్ని బీసీసీఐ ఎంపిక చేసింది. నాలుగో నెంబర్‌లో వస్తున్న సమస్యను అధిగమించేందుకు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శ్రేయాస్ అయ్యర్.. మూడు ఆప్షన్లను ఉంచుకుంది. దీని గురించి మీడియా సమావేశంలో రోహిత్ శర్మను ప్రశ్నించగా.. తాను స్పెసిఫిక్‌గా ఒక నెంబర్ ప్లేయర్ కోసం చూడటం లేదని చెప్పాడు.

ప్లేయర్ల నుంచి మంచి ఫ్లెక్సిబిలిటీని ఆశిస్తున్నట్లు రోహిత్ వెల్లడించాడు. అంటే ఆటగాళ్లకు ఒక రోల్ ఇవ్వరా? అలాగైతే ప్లేయర్లలో కన్‌ఫ్యూషన్ పెరిగిపోదా? అని కొందరు విలేకరులు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు.. 'మేం అలాంటి పిచ్చి పనులు ఏమీ చేయం' అంటూ గట్టిగా సమాధానం ఇచ్చాడు రోహిత్. దీంతో ఆ విలేకరులు టెన్షన్ పడిపోయారు.

Rohit Sharma

ఫ్లెక్సిబిలిటీ అంటే సడెన్‌గా లోయర్ ఆర్డర్ బ్యాటర్‌ను ఓపెనింగ్ చేయమని చెప్పడం కాదంటూ క్లారిటీ ఇచ్చాడు. 'ఇది నేను వివరించక తప్పదు. ఇది అర్థం కావడం చాలా ముఖ్యం. ఓపెనర్‌ను ఏడో నెంబర్‌లో బ్యాటింగ్‌కు పంపడం ఫ్లెక్సిబిలిటీ కాదు. అలాగే హార్దిక్ చేత ఓపెనింగ్ చేయించడం కూడా కాదు' అని చెప్పాడు.

'రోహిత్, ధవన్ ఇద్దరూ ఏడెనిమిది సంవత్సరాలు ఓపెనింగ్ చేశారు అలాగే విరాట్ కోహ్లీ కేవలం మూడో స్థానంలోనే ఆడాడు. ఇప్పుడు కొత్తగా నాలుగు, ఐదు స్థానాల కోసం వచ్చిన కుర్రాళ్లు మాత్రం బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకూ, పైకీ వెళ్లినా ఆడేలా ఉండాలి. సీనియర్ ప్లేయర్లు దాదాపుగా ఒక రోల్‌కే పరిమితం అవుతారు' అని రోహిత్ వివరించాడు.

'గత నాలుగు, ఐదు సంవత్సరాలు చూసుకున్నా.. ఓపెనర్లు అదే స్థానంలో, మూడో ప్లేస్ ప్లేయర్ అదే స్థానంలో ఆడుతూ వచ్చారు. కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో వస్తాడు. అతను అక్కడే ఆడుతున్నాడు. ఆరో స్థానంలో హార్దిక్, ఏడో స్థానంలో జడేజా ఆడతారు. ఒకవేళ నాలుగు, ఐదు స్థానాలు ముందుకూ వెనక్కూ జరిగినా సమస్య ఉండదు. ఆ మాత్రం ఫ్లెక్సిబిలిటీ చాలా ముఖ్యం' అని రోహిత్ పేర్కొన్నాడు.

Story first published: Tuesday, August 22, 2023, 11:55 [IST]
Other articles published on Aug 22, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+