ఆసియా కప్‌లో సూపర్-4 మ్యాచులు మొదలయ్యాయి. తొలి మ్యాచ్‌లో హోస్ట్ పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ తలపడుతోంది. లాహోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాక్ తన పేస్ బలాన్ని మరోసారి చూపించాలని అనుకుంటోంది. అదే సమయంలో లాహోర్‌లో తమ చివరి మ్యాచ్ నెగ్గిన బంగ్లా.. ఇక్కడ మరోసారి తమ సత్తా చాటాలని అనుకుంటోంది. అయితే హోం అడ్వాంటేజితో పాకిస్తాన్ బరిలో దిగుతోంది.
ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్ టాస్ గెలిచాడు. ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఆసియా కప్‌లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచులన్నింట్లో బంగ్లా కెప్టెన్ టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకోవడం గమనార్హం. ఈ వ్యూహం శ్రీలంకపై బెడిసికొట్టింది. కానీ ఆఫ్గానిస్తాన్‌పై బాగా పనిచేసింది. ఈ క్రమంలో పాక్‌పై కూడా ఇదే వ్యూహంతో బంగ్లాదేశ్ బరిలో దిగుతున్నట్లు కనిపిస్తోంది.

'మేం మంచి స్కోరు చేస్తే.. పాక్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఆఫ్గానిస్తాన్‌పై ఎలా రాణించామో, ఇప్పుడు కూడా అలాగే సత్తా చాటాలని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ప్రపంచ నెంబర్ వన్ టీంతో తలపడుతున్నాం. కాబట్టి మా బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వాలి. పాక్ బలం ఏంటి? బలహీనత ఏంటి? అని మాకు తెలుసు. మేం ఈ మ్యాచ్‌లో చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటికి సిద్ధంగా ఉన్నాం' అని షకీబల్ హసన్ వెల్లడించాడు.
అలాగే తమ టీంలో ఒకే ఒక మార్పు చేసినట్లు చెప్పాడు. ఆఫ్గాన్‌పై సెంచరీతో ఆకట్టుకున్న షాంటో స్థానంలో లిటాన్ దాస్ ఆడుతున్నట్లు ప్రకటించాడు. ఇది చూసిన ఫ్యాన్స్ షాకవుతున్నారు. అదే సమయంలో తాను టాస్ గెలిచినా ముందుగా బ్యాటింగ్ తీసుకునే వాడినని పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్నాడు. అయితే పిచ్‌పై కొంత పచ్చదనం ఉందని, దాన్ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు.
'ఫాస్ట్ బౌలర్లను జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటున్నాం. ఎండలో ఆడుతున్నాం కదా. ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాం. చివరగా ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో పేసర్లకు పిచ్ నుంచి సహకారం దక్కింది. కాబట్టి ఎక్స్‌ట్రా ఫాస్ట్ బౌలర్‌ను జట్టులోకి తీసుకోవాలని అనుకున్నాం. కొన్నిసార్లు ఇక్కడ పిచ్ నుంచి పేసర్లకు సహకారం ఉంటుంది' అని చెప్పాడు.
ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తే.. పాక్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా సయీద్ అన్వర్ రికార్డును బాబర్ సమం చేస్తాడు. దాన్ని ఈ మ్యాచ్‌లో బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తానని బాబర్ మాటిచ్చాడు.