Asia Cup 2023 : సంజూకు ఈ అన్యాయం కొత్తేం కాదు.. గతంలో కూడా ఇదే కథ!
వన్డేల్లో మంచి ఫామ్‌లో ఉన్న ప్లేయర్లలో సంజూ శాంసన్ ఒకడు. అతను బ్యాటింగ్ చేసే ప్లేస్‌తో ఫుట్‌బాల్ ఆడకపోతే నిలకడగా రాణిస్తున్నాడు కూడా. ఇటీవల అతను 12 ఇన్నింగ్సుల్లో బ్యాటింగ్ చేసి 390 పరుగులు చేశాడు. వీటిలో మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
అయినా సరే అతనికి ఆసియా కప్‌లో అవకాశం దక్కలేదు. ఇలా కుర్రాళ్ల కోసం సంజూను పక్కన పెట్టడం ఇదేం కొత్త కాదు. గతంలో కూడా సంజూను ఇలాగే సెలెక్టర్లు నెగ్లెక్ట్ చేశారు.
తిలక్ వర్మ కోసం..
లిస్ట్-ఎ క్రికెట్‌లో సంజూ డబుల్ సెంచరీ కూడా చేశాడు. కానీ అతనికి ఈ ఏడాది ఆడే ఆసియా కప్ టీంలో చోటు దక్కలేదు. అయితే వన్డే అరంగేట్రమే చేయని తిలక్ వర్మను సెలెక్టర్లు ఎంపిక చేశారు. తిలక్ ట్యాలెంటెడ్ ప్లేయరే అయినా కూడా.. వన్డేల్లో నిలకడగా రాణించిన సంజూ పరిస్థితి ఏంటి? అతన్ని కేవలం రిజర్వ్‌గా ప్రకటించడం నిజంగా అన్యాయమే.

2018లో కూడా..
సంజూ టీ20ల్లో 2015లోనే అరంగేట్రం చేశాడు. కానీ వన్డే అరంగేట్రం కోసం 2021 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. తన సత్తా నిరూపించుకున్నా కూడా అతనికి వన్డే మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. అదే సమయంలో 2018లో రిషభ్ పంత్‌కు అవకాశం దక్కింది.
ధోనీ కెరీర్ చివరి దశలో ఉన్నప్పుడు సెలెక్టర్లు రిషభ్ పంత్‌కు చాలా అవకాశాలు ఇచ్చారు. పంత్ వన్డే ఫార్మాట్‌లో ఫర్వాలేదనిపించాడు. అయితే సంజూకు కూడా అవకాశాలు ఇవ్వాల్సిందని చాలా మాంది అభిప్రాయపడ్డారు. అది మాత్రం జరగలేదు.
అయ్యర్ అడ్డంకి..
ఐపీఎల్‌లో 2016, 2017 సీజన్లలో అయ్యర్, సంజూ కలిసి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడారు. ఈ సమయంలోనే 2017లో అయ్యర్ వన్డే అరంగేట్రం చేశాడు. ఈ ఫార్మాట్‌లో అయ్యర్ అద్భుతంగా రాణించాడు. దీంతో సెలెక్టర్లు మరో ప్లేయర్ కోసం వెతకలేదు. అయ్యర్ బ్రిలియంట్ పెర్ఫామెన్స్‌తో శాంసన్‌కు వన్డేలు ఆడే అవకాశమే రాలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications