Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: సచిన్ రికార్డు బద్దలు కొట్టేందుకు కోహ్లీ రెడీ.. పాక్‌పై సెంచరీ గ్యారంటీ!

టీమిండియా ఏస్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో నిలిచాడు. పాక్‌తో జరిగే ఆసియా కప్ 2023 మ్యాచ్‌లో కనుక కోహ్లీ చెలరేగితే సచిన్ పేరిట ఉన్న రికార్డు బద్దలవడం ఖాయం. 34 ఏళ్ల విరాట్ కోహ్లీకి వన్డే ఫార్మాట్ ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఈ ఫార్మాట్‌లో కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యం. ఈ క్రమంలోనే ప్రస్తుతం కోహ్లీ మరో అరుదైన మైలురాయి చేరుకునేలా ఉన్నాడు.

ఇప్పటి వరకు 275 వన్డే మ్యాచులు ఆడిన కోహ్లీ 57.32 సగటు, 93.62 స్ట్రైక్ రేటుతో 12,898 పరుగులు చేశాడు. వీటిలో 46 సెంచరీలు, 65 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పాక్‌తో మ్యాచ్‌లో కనుక కోహ్లీ ఒక 102 రన్స్ చేస్తే.. వన్డే ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 13 వేల పరుగుల మైలురాయి చేరుకున్న బ్యాటర్‌గా కోహ్లీ నిలుస్తాడు. కోహ్లీ ఇప్పటి వరకు 265 ఇన్నింగ్సుల్లో బ్యాటింగ్ చేశాడు.

Virat Kohli

ప్రస్తుతం అత్యంత వేగంగా 13 వేల వన్డే పరుగులు చేసిన రికార్డు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 321 ఇన్నింగ్సుల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఈ జాబితాలో సచిన్ తర్వాతి స్థానంలో 341 ఇన్నింగ్సులతో రికీ పాంటింగ్ రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర (363 ఇన్నింగ్సులు), నాలుగో స్థానంలో సనత్ జయసూర్య (416 ఇన్నింగ్సులు) ఉన్నారు.

ఓవరాల్‌గా చూసుకున్న వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కూడా కోహ్లీ ఐదో స్థానంలో ఉన్నాడు. ఈ ఫార్మాట్‌లో 18,426 పరుగులు చేసిన సచిన్ ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత వరుసగా సంగక్కర (14324), పాంటింగ్ (13704), జయసూర్య (13430) ఉన్నారు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న కోహ్లీ ఈ ఏడాదిలోనే ఈ జాబితాలో ముందడుగు వేసే ఛాన్స్ ఉంది.

ఈ నేపథ్యంలోనే పాక్‌పై విరాట్ కోహ్లీ చెలరేగుతాడని, సెంచరీ బాది ఈ మ్యాచ్‌లోనే సచిన్ రికార్డు బద్దలు కొడతాడని ఫ్యాన్స్ అంటున్నారు. పాక్ బౌలర్లకు చుక్కలు చూపించి భారీ శతకం నమోదు చేయాలని నెట్టింట కోరుకుంటున్నారు. ప్రస్తుతం మంచి టచ్‌లో ఉన్న కోహ్లీ కూడా అదే రేంజ్‌లో రాణిస్తే పాక్‌కు చుక్కలు చూపించడం గ్యారంటీ అని నిపుణులు అంటున్నారు.

Story first published: Saturday, September 2, 2023, 12:09 [IST]
Other articles published on Sep 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+