Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: నేపాల్‌ను చిత్తు చేసిన పాక్.. భారత్‌కు విసురుతున్న మూడు కీలక సవాళ్లు ఇవే!

చివరగా భారత్, పాక్ వన్డే ఫార్మాట్‌లో తలపడి నాలుగేళ్లు అయిపోయింది. 2019 వరల్డ్ కప్‌ గ్రూప్ దశలో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఆ తర్వాత మళ్లీ వన్డే ఫార్మాట్‌లో తలపడే అవకాశం ఈ టీమ్స్‌కు రాలేదు. ఇప్పుడు ఆసియా కప్‌లో మళ్లీ ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నాయి. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో నేపాల్‌ను చిత్తు చేసిన పాక్.. భారత్‌కు మూడు సవాళ్లు విసిరేందుకు రెడీ అవుతోంది.

బాబర్ సూపర్ ఫామ్: భారత్‌తో జరిగిన వన్డేల్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ రాణించలేదు. భారత బౌలర్లు బాబర్ బ్యాటుకు బ్రేకులు వేయడంలో సక్సెస్ అయ్యారు. భారత్‌పై ఐదు వన్డేలు ఆడిన బాబర్ ఒక్కసారి కూడా కనీసం హాఫ్ సెంచరీ మార్కు దాటలేదు. అయితే నేపాల్‌తో జరిగిన ఆసియా కప్ ఓపెనర్‌లో బాబర్ చెలరేగాడు.

Babar Azam

ప్రస్తుతం నెంబర్ వన్ వన్డే బ్యాటర్‌గా ఉన్న అతను.. లంక ప్రీమియర్‌ లీగ్‌లో కూడా ఆకట్టుకున్నాడు. నేపాల్‌పై కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన బాబర్ అద్భుతంగా ఇన్నింగ్స్ నిర్మించి 150 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా అతన్ని ఎలా అడ్డుకుంటుందో చూడాలి.

షహీన్ అండ్ కో: ముల్తాన్‌లో పేసర్లు రాణించడం చాలా అరుదు. కానీ నేపాల్‌ రెండు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయింది. అంటే పాక్ కొత్త బాల్ బౌలర్లు ఎంత అద్భుతంగా రాణించారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, పాక్ కొత్త బాల్ పేసర్లను ఎదుర్కోవడంలో భారత ఓపెనర్లకు కూడా అంత గొప్ప రికార్డు లేదు.

గతేడాది పొట్టి ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌లో పాక్ పేసర్లు ఆకట్టుకున్నారు. షహీన్ అఫ్రిదీ టాప్ క్లాస్ బౌలర్. అదే సమయంలో మరో కుర్రాడు నసీమ్ షా కూడా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. మరి వీళ్లను భారత ఓపెనర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Pakistan Team

స్పిన్ మంత్రం: ఇటీవల విండీస్‌తో జరిగిన సిరీసులో అకీల్ హొస్సేన్, యానిక్ కిరాయ, గుడకేష్ మోతీ.. ముగ్గురూ కూడా స్పిన్‌ను ఎదుర్కోవడంలో భారత్ బలహీనతను ఎండగట్టారు. ఇదే బలహీనత పాక్‌తో ఆసియా కప్ మ్యాచ్‌లో కూడా భారత్ కొంపముంచేలా ఉంది. ఎందుకంటే పాక్ స్పిన్నర్లు ఈ ఆసియా కప్‌ను ఘనంగా ఆరంభించారు.

ముఖ్యంగా ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్.. నేపాల్‌పై నాలుగు వికెట్లతో చెలరేగాడు. స్పిన్‌ను ఎదుర్కోవడంలో తడబడుతున్న భారత బ్యాటింగ్ లైనప్.. షాదాబ్ ఖాన్ నేతృత్వంలోని పాక్ స్పిన్ దళాన్ని ఎలా ఎదుర్కొంటుందనేది పెద్ద సమస్యే.

Story first published: Thursday, August 31, 2023, 20:06 [IST]
Other articles published on Aug 31, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+