Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2023: హ్యాపీ బర్త్ డే ‘ప్రిన్స్’.. కేక్ మొఖంతో ఉన్న గిల్ ఫొటో వైరల్!

టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 24వ ఏట అడుగు పెట్టాడు. శుక్రవారం నాడు అతని బర్త్ డే వేడుకలను టీమిండియా జరుపుకుంది. సూపర్-4లో తమ తొలి మ్యాచ్‌లో టీమిండియా పాకిస్తాన్‌తో ఢీకొట్టనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం కొలంబో చేరుకున్న టీమిండియా.. వర్షం కారణంగా ఇండోర్ ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహిస్తోంది. ఈ సమయంలోనే గిల్ బర్త్‌ డేను టీంమేట్స్ సెలబ్రేట్ చేశారు.

ఈ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చూపిస్తూ.. టీమిండియా ఎడం చేతి వాటం స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక వీడియోను నెట్టింట షేర్ చేశాడు. టీం క్యాంప్‌లో ఎంత అల్లరిగా బర్త్ డే జరిగిందో ఈ వీడియోలో కనిపించింది. ఈ వీడియో తన టీంమేట్స్ అందరి ముందూ గిల్ కేక్ కట్ చేస్తూ కనిపించాడు. అలాగే మొఖం నిండా కేక్‌తో ఉన్న గిల్ ఫొటోను కూడా కుల్దీప్ యాదవ్ షేర్ చేశాడు.

Shubman Gill Birthday

'హ్యాపీ బర్త్ డే మై బ్రో శుభ్‌మన్ గిల్' అని ఈ వీడియోకి కుల్దీప్ క్యాప్షన్ పెట్టాడు. ఇది చూసిన ఫ్యాన్స్ కూడా ఈ 'ప్రిన్స్'కు బర్త్ డే విషెస్ చెప్తున్నారు. భవిష్యత్తులో మరెన్నో రికార్డులు గిల్ బద్దలు కొడతాడని అంతా ఆశిస్తున్నారు. కాగా, ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో మాత్రం గిల్ అంత గొప్పగా ఆడలేదనే చెప్పాలి. ముఖ్యంగా పాక్‌తో మ్యాచ్‌లో అతను చాలా తడబడ్డాడు. నసీం షా బంతులను ఏమాత్రం అంచనా వేయలేకపోయాడు.

చివరకు హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. అయితే ఆ తర్వాత నేపాల్‌పై గిల్ ప్రతాపం చూపించాడు. పసికూన టీం బౌలింగ్‌పై ఎదురుదాడి చేసి, హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. గిల్ బ్యాటింగ్‌లో కొన్ని టెక్నికల్ లోపాలు ఉన్నాయని, వాటిని సరి చేసుకుంటే అతను మళ్లీ చెలరేగుతాడని గంభీర్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు సలహా ఇస్తున్నారు. మరి గిల్ ఏం చేస్తాడో చూడాలి.

Story first published: Saturday, September 9, 2023, 10:32 [IST]
Other articles published on Sep 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+