పాక్‌తో జరుగుతున్న హైఓల్టేజ్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. పల్లెకెలె వాతావరణం క్లియర్ అవడంతో అనుకున్న సమయానికే టాస్ వేశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ ముందుగా బ్యాటింగ్ చేస్తున్నట్లు చెప్పాడు. వర్షం వచ్చే అవకాశం ఉండటంతో టాస్ నెగ్గిన టీం ఛేజింగ్ ఎంచుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ పిచ్ చూసిన చాలా మంది ముందుగా బ్యాటింగ్ చేయడం మంచిదని సలహా ఇచ్చారు.
రోహిత్ కూడా దీన్నే దృష్టిలో పెట్టుకొని ముందుగా బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో కీలక పేసర్ మహమ్మద్ షమీ ఆడటం లేదని రోహిత్ చెప్పాడు. ఆసియా కప్ చాలా కీలకమైన టోర్నమెంట్ అని, అయితే విండీస్ సిరీస్ తర్వాత తమకు రెస్ట్ దొరకడం మంచిదైందని రోహిత్ అన్నాడు. వర్షం టెన్షన్ ఉన్నా కూడా తాము ఈ ఛాలెంజ్ స్వీకరించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.

ఈ మ్యాచ్‌లో ముగ్గురు సీమర్లతో బరిలో దిగుతున్నామని చెప్పిన రోహిత్.. శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ఆడుతున్నట్లు చెప్పాడు. అలాగే జడేజా, కుల్దీప్ ఇద్దరూ స్పిన్ బౌలింగ్ బాధ్యతలు చేపడతారని అన్నాడు. అయితే షమీని ఎందుకు తీసుకోలేదనే కారణం రోహిత్ చెప్పలేదు.
ఇది చూసిన చాలా మంది నిపుణులు షాకవుతున్నారు. పాక్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టగల సత్తా షమీకి ఉందని, అలాంటి ప్లేయర్‌ను ఎలా పక్కన పెడతారని? అడుగుతున్నారు. అయితే షమీ పూర్తి ఫిట్‌గా లేకపోవచ్చని కూడా కొందరు అంటున్నారు. ఏదేమైనా షమీ లేకపోవడం భారత జట్టుకు సమస్యే అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
ఇషాన్ కిషన్‌ను టీంలోకి తీసుకోవడంతో అతను మూడో స్థానంలో ఆడతాడేమో? అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. లేదంటే కిషన్‌ను ఓపెనర్‌గా పంపి, రోహిత్ మిడిలార్డర్‌లో వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అయితే మాజీలు చాలా మంది చెప్పినట్లు విరాట్ కోహ్లీని నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపుతారని అనుకుంటున్నారు. మరి టీం మేనేజ్‌మెంట్ ఏం చేస్తారో చూడాలి.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా