Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2023: ఏ సెంటర్ అయినా.. మీ తాట తీస్తాం.. పాక్‌కు మాజీ లెజెండ్ గట్టి వార్నింగ్!

ఆసియా కప్ సూపర్-4 దశ కూడా మొదలైంది. కానీ ఈ టోర్నీపై పీసీబీ, బీసీసీఐ మధ్య గొడవ మాత్రం చల్లారడం లేదు. గ్రూప్ దశలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసిన సంగతి తెలిసిందే. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఒక ఇన్నింగ్స్ మాత్రమే జరిగింది. ఇక మళ్లీ ఈ రెండు టీమ్స్ ఢీకొట్టేందుకు టైం దగ్గరపడుతోంది. అయితే ఈ మ్యాచ్ జరిగే కొలంబోను వరుణ దేవుడు ముంచేస్తున్నాడు.

ఈ క్రమంలో సూపర్-4 మ్యాచులను కొలంబో నుంచి హంబంతోటకు మార్చాలని ఏసీసీ అనుకుంది. కానీ చివరి నిమిషంలో ఇలా వేదిక మారిస్తే.. తమ ఎక్విప్‌మెంట్ మొత్తం మార్చడం కుదరదని బ్రాడ్‌కాస్టర్లు చెప్పారట. దీంతో ఈ వేదికను మార్చకుండా కొలంబోలోనే మ్యాచులు నిర్వహించేందుకు ఏసీసీ నిర్ణయించింది. దీంతో పీసీబీ మాజీ చీఫ్ నజాం సేథికి చిర్రెత్తుకొచ్చింది.

Harbhajan Singh Najam Sethi

కొలంబోలో వాతావరణం ఎలా ఉంటుందో ఫొటో షేర్ చేసిన అతను.. ఇలా వర్షం పడే అవకాశం ఉందని తెలిసి కూడా ఇక్కడే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ పెట్టడం ఏంటి? అసలు పాక్‌తో ఆడాలని భారత్‌కు లేదా? ఓడిపోతామని భయపడుతున్నారా? అంటూ తన ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పెస్టు పెట్టాడు. దీనిపై టీమిండియా మాజీ దిగ్గజం హర్భజన్ సింగ్ స్పందించాడు.

పాక్‌పై భారత్ రికార్డులు చూపిస్తే ఇలాంటి పిచ్చి వాగుడు తగ్గిపోతుందని భజ్జీ అన్నాడు. 'ఈ మధ్య నజాం సేథీ ఏం తాగుతున్నాడో తెలీదు. పాకిస్తాన్ ఫేవరెట్, మమ్మల్ని ఆడటానికి భారత్‌కు భయం.. వంటి పిచ్చి డైలాగులు వేస్తున్నాడు. భారత్, పాకిస్తాన్ ఇప్పటి వరకు ఆడిన మ్యాచుల రికార్డులు తీయండి. వాటిని నజాం సేథీకి పంపండి. అప్పుడు ఇలాంటి వాగుడు రాదు' అని భజ్జీ ఘాటుగా స్పందించాడు.

'ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్‌లో నజాం సేథీకి ఒక స్థాయి ఉంది. అలాంటి వ్యక్తి ఇలాంటి కామెంట్లు చేయడం చాలా దారుణం' అని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు, పాకిస్తాన్‌కు ఓపెన్ సవాల్ విసిరాడు. 'పాక్‌ను ఎదుర్కోవడానికి భారత్‌కు భయమని తను అన్నాడు. ఎవరిని ఎదుర్కోవడానికి ఇండియా ఎప్పుడూ భయపడదు. అసలు నజాం సేథీ కామెంట్స్‌కు బేస్ ఏంటో కూడా తెలీదు' అని భజ్జీ చెప్పాడు.

ఆసియా కప్ నిర్వహణతో ఏదైనా సమస్య ఉంటే.. ఏసీసీతో మీటింగ్ పెట్టుకోవాలని భజ్జీ సూటిగా చెప్పేశాడు. అంతేకానీ, ఇలాంటి పిచ్చివాగుడు ఎక్కడి కాదు. 'వాతావరణం సరిగా ఉన్నా లేకున్నా సరే.. మీకు ఇష్టమైన చోట ఆడదాం రండి. మేం ఎక్కడైనా సరే మిమ్మల్ని ఓడిస్తాం' అని భజ్జీ సవాల్ విసిరాడు. ఇక సూపర్-4లో భారత్, పాక్ మధ్య జరిగే మ్యాచ్‌కు తాజాగా రిజర్వ్ డే కూడా ప్రకటించన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, September 9, 2023, 8:58 [IST]
Other articles published on Sep 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+