Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsPAK: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వెదర్ రిపోర్టులో కీలక అప్‌డేట్!

భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు తొలగినట్లే కనిపిస్తోంది. 2019 వరల్డ్ కప్ తర్వాత ఈ రెండు జట్లు వన్డేలో తలపడుతున్నాయి. పల్లెకెలె స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు వరుణుడి ముప్పు ఉందని తెలిసిన ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడ్డారు. అయితే తాజా అంచనాల ప్రకారం ఈ మ్యాచ్‌కు వరుణుడి అడ్డంకి తొలగినట్లే కనిపిస్తోంది. ఆకాశం మాత్రం మేఘావృతమై ఉంటుందట.

మ్యాచ్ రోజున సాయంత్రానికి పల్లెకెలెలో వర్షం పడే అవకాశం 90 శాతం వరకు ఉందని తెలిసిన ఫ్యాన్స్ చాలా ఆందోళన చెందారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు కేవలం గంటల వ్యవధిలోనే అయిపోయాయంటేనే.. ఫ్యాన్స్ ఈ మ్యాచ్ కోసం ఎంతగా ఎదురు చూశారో అర్థం చేసుకోవచ్చు. అలాంటి మ్యాచ్ వర్షార్పణం అవుతుందేమో? అని చాలా మంది భయపడ్డారు.

Rohit Sharma Babar Azam

ఈ రెండు టీమ్స్ చివరగా గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి అంచున నిలిచింది. అలాంటి సమయంలో విరాట్ కోహ్లీ (82 నాటౌట్) వీరోచిత ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆ తర్వాత మళ్లీ భారత్, పాక్ తలపడుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇలాంటి సమయంలో వర్షం వార్తలు టెన్షన్ పెట్టాయి.

India practice

తాజాగా పల్లెకెలె వాతావరణం గురించి అందుతున్న సమాచారం ప్రకారం, ఇక్కడ కేవలం చిరుజల్లులు మాత్రమే పడుతున్నాయట. ఇవి కూడా మ్యాచ్ మొదలయ్యే సమయానికి తగ్గిపోతాయట. ఈ రోజు భారీ వర్షం పడే అవకాశమే లేదని వెదర్ రిపోర్టులు చెప్తున్నాయి. అయితే ఎండ పొడ మాత్రం చూపదని తెలుస్తోంది.

pakistan team practice

తాజా అంచనాల ప్రకారం ఈ మ్యాచ్ పూర్తిగా జరుగుతుంది. ఈ వార్తలు ప్రస్తుతం ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపుతున్నాయి. ఇప్పటి వరకు వర్షం పడుతుందని టెన్షన్ పడిన వాళ్లంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఏడాది తర్వాత దాయాదుల పోరు బ్లాక్ బస్టర్ హిట్ అవడం ఖాయం అంటున్నారు.

Story first published: Saturday, September 2, 2023, 13:16 [IST]
Other articles published on Sep 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+