For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs PAK: పాక్ అంటే చాలు పూనకం వచ్చేస్తుంది.. ఈ ముగ్గుర్నీ అడ్డుకోవడానికి పక్కా ప్లాన్లు వేస్తున్న బాబర్!

ఆసియా కప్ 2023లో భారత జట్టు తమ తొలి మ్యాచ్ ఆడేందుకు రెడీ అవుతోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి ఈ టోర్నీలో శుభారంభం చేయాలని టీమిండియా భావిస్తోంది. ఈ క్రమంలో భారత్‌కు సమస్యగా మారే పాక్ ప్లేయర్లు ఎవరా? అని టీమిండియా ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు.

అదే సమయంలో పాకిస్తాన్‌కు కూడా భారత స్టార్లు పెద్ద తలనొప్పిగా మారతారని మర్చిపోకూడదు. వీళ్లను అడ్డుకోకపోతే పాకిస్తాన్ ఈ మ్యాచ్ గెలవడం అసాధ్యం అనే చెప్పాలి. అలా పాక్‌ను తిప్పలు పెట్టే ముగ్గురు కీలక ప్లేయర్లు ఎవరంటే?

Virat Kohli

విరాట్ కోహ్లీ: కోహ్లీ మంచి ఫామ్‌లో ఉంటే ఎవరూ అతన్ని ఆపలేరు. అదే పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే చాలు ఈ ఏస్ బ్యాటర్ ఆటతీరు మరో స్థాయికి చేరుతుంది. పాక్‌పై ఇప్పటి వరకు 13 ఇన్నింగ్సుల్లో 48.73 సగటుతో 536 పరుగులు చేశాడీ స్టార్ బ్యాటర్. వన్డే ఫార్మాట్‌లో ఫామ్ కూడా అందుకున్న కోహ్లీని అడ్డుకోవడం పాక్‌కు తలకు మించిన పనే అని చెప్పాలి.

2012 ఆసియా కప్‌లో పాక్‌పై 183 పరుగులతో చెలరేగిన కోహ్లీ.. ఆ తర్వాత 2015 వన్డే వరల్డ్ కప్‌లో కూడా చెలరేగాడు. వరల్డ్ కప్‌లో పాక్‌పై సెంచరీ చేసిన తొలి భారత ప్లేయర్‌గా నిలిచాడు. గత వరల్డ్ కప్‌లో కూడా పాక్‌పై కోహ్లీ బాగానే ఆడాడు. అందుకే కోహ్లీని అడ్డుకోవడానికి పాక్ కెప్టెన్ రకరకాల వ్యూహాలు రచిస్తున్నాడు.

Hardik Pandya

హార్దిక్ పాండ్యా: వైట్ బాల్ క్రికెట్‌లో భారత్‌కు అత్యంత కీలకమైన ప్లేయర్లలో హార్దిక్ పాండ్యా ఒకడు. పాక్‌పై పాండ్యా రికార్డు కూడా అద్భుతంగానే ఉంది. ముఖ్యంగా వన్డేల్లో పాండ్యా చాలా చక్కగా రాణించాడు. పాక్‌పై అతను ఆడింది మూడు ఇన్నింగ్సులే కానీ.. వాటిలో 61 సగటు, 179 స్ట్రైక్ రేటుతో 122 పరుగులు చేశాడు.

2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో కూడా పాక్‌పై భారత్‌ను గెలిపించేందుకు పాండ్యా (76) ఒంటరి పోరాటం చేశాడు. భారత్, పాక్ మ్యాచ్ ఒత్తిడిని తట్టుకొని ఆడటంలో పాండ్యా దిట్ట. గతేడాది ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్‌లలో పాక్‌పై అతను ఎలా ఆడాడో అందరికీ తెలిసిందే. కాబట్టి పాక్ కనుక గెలవాలంటే పాండ్యాను ఎలా అడ్డుకోవాలో ఆలోచించుకోక తప్పదు.

Kuldeep Yadav

కుల్దీప్ యాదవ్: కేవలం ఆసియా కప్‌లోనే కాదు, వరల్డ్ కప్‌లో కూడా టీమిండియాకు కుల్దీప్ యాదవ్ కీలకం కానున్నాడు. జట్టులో రీఎంట్రీ తర్వాత అద్భుతంగా రాణిస్తున్న ఈ స్పిన్నర్.. ఏడాది కాలంలో 15 మ్యాచుల్లో 29 వికెట్లు తీసుకున్నాడు. ఎకానమీ 5 కన్నా తక్కువే. పాక్‌పై కూడా కుల్దీప్ రికార్డు ఫర్వాలేదు.

దానికితోడు ఇప్పుడు కుల్దీప్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అంతేకాదు, ప్రస్తుతం నెంబర్ వన్ వన్డే బ్యాటర్ బాబర్ ఆజమ్‌ను గతంలో కుల్దీప్ బాగా ఇబ్బంది పెట్టాడు. ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ తలపడినప్పుడు కుల్దీప్ వేసిన 34 బంతులు ఎదుర్కొన్న బాబర్.. కేవలం 18 పరుగులే చేసి రెండుసార్లు అవుటయ్యాడు. కుల్దీప్‌ను సరిగా ఎదుర్కోకపోతే బాబర్‌ మరోసారి తేలిపోవడం ఖాయం.

Story first published: Saturday, September 2, 2023, 7:57 [IST]
Other articles published on Sep 2, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+