ఆసియా కప్‌లో టీమిండియా అదృష్టం ఏమీ బాగున్నట్లు లేదు. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఎదుర్కొన్న భారత్.. ఈ మ్యాచ్‌ను పూర్తి చేయలేకపోయింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్ పూర్తయిన తర్వాత వర్షం పడింది. దీంతో ఫలితం లేకుండానే ఈ మ్యాచ్ ముగిసింది. ఇది చూసిన ఫ్యాన్స్ చాలా నిరాశ చెందారు. మంచి థ్రిల్లింగ్ మ్యాచ్ చూడాలని అనుకన్న వారి ఆశలపై ఇలా వరుణ దేవుడు నీళ్లు చల్లాడు.
ఈ క్రమంలో భారత్ ఆడే రెండో మ్యాచ్ కోసం టీమిండియా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ కూడా జరగడం అనుమానంగానే ఉంది. భారత్, నేపాల్ మధ్య సోమవారం నాడు జరిగే మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పల్లెకెలెలో సోమవారం ఉదయం వర్షం పడే అవకాశం 60 శాతం ఉందని వాతావరణ శాఖ అంటోంది. దీంతో ఫ్యాన్స్‌లో మరోసారి టెన్షన్ మొదలైంది.

అయితే మ్యాచ్ టాస్ జరిగే సమయానికి వర్షం పడే అవకాశం బాగా తగ్గుతుందని సమాచారం. అంటే ఉదయం వర్షం పడినా కూడా.. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మాత్రమే ఉంటుంది. దీన్ని గ్రౌండ్ స్టాఫ్ వేగంగా రెడీ చేస్తే మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి పల్లెకెలెలో వర్షం పడే ఛాన్స్ కేవలం 22 శాతమే ఉందట. సాయంత్రం 6 గంటల వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా.
కానీ ఆ తర్వాత మళ్లీ వర్షం పడే అవకాశాలు పెరిగిపోతాయి. ఇక్కడ సాయంత్రం 6 గంటల తర్వాత 66 శాతం వర్షం పడే అవకాశం ఉందట. అంటే ఈ మ్యాచ్ కూడా భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లాగే ముగిసే అవకాశం ఉంది. ఒక ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత రెండో ఇన్నింగ్స్ మొత్తం వర్షం వల్ల తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఈ వార్తలు విన్న ఫ్యాన్స్ అందరూ కూడా భారత్ దురదృష్టం ఇలా ఉందని ఫీల్ అవుతున్నారు.