For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Pakistan: కోహ్లీ కోసం పెద్ద స్కెచ్ వేసిన పాక్.. ఇంత ప్లానింగ్ ఉందా?

పాకిస్తాన్‌తో మరోసారి తలపడేందుకు భారత జట్టు రెడీ అవుతోంది. కొలంబో వేదికగా జరిగే సూపర్-4 మ్యాచ్‌లో ఈ రెండు దేశాలు తలపడనున్నాయి. గ్రూప్ దశ మ్యాచ్‌లో చేసినట్లే పక్కా ప్లాన్‌తో విరాట్ కోహ్లీని బుట్టలో వేసుకోవాలని పాక్ టీం ప్లాన్ చేస్తోంది. దాని కోసం ఆ టీం కొన్ని స్టెప్స్ ఫాలో అవుతోందట. అవేంటంటే?

త్వరగా క్రీజులోకి..
ఎంత గొప్ప బ్యాటర్ అయినా సరే కొత్త బంతిని ఎదుర్కోవడంలో కొంత తడబడటం సహజమే. విరాట్ కోహ్లీ కూడా అంతే. కాబట్టి అతన్ని సాధ్యమైనంత త్వరగా క్రీజులోకి తీసుకురావడం పాక్ ప్లాన్. గ్రూప్ దశ మ్యాచులో కూడా పవర్‌ప్లేలోనే అతను అవుటైన సంగతి తెలిసిందే. బంతి కొంచెం పాతబడినా కూడా.. క్రీజులో కుదురుకొని చెలరేగడం కోహ్లీకి బాగా అలవాటు.

India vs Pakistan

పాక్‌పై కోహ్లీ రికార్డు అద్భుతంగా ఉంది. మొత్తం 14 మ్యాచుల్లో 45 సగటు, 96 స్ట్రైక్ రేటుతో రాణించాడీ మోడ్రన్ గ్రేట్. కానీ ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. పాక్‌పై నాలుగు సార్లు 75+ స్కోర్లు చేసిన కోహ్లీ.. ఏకంగా ఏడుసార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఇవన్నీ కూడా కొత్తబంతిని ఎర్లీగా ఎదుర్కొన్నప్పుడు అవుటైనవే కావడం గమనార్హం.

India vs Pakistan

నో షాదాబ్..
లెగ్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో కోహ్లీ దిట్ట. ముఖ్యంగా వన్డేల్లో కుడిచేతి వాటం లెగ్ బ్రేక్, ఎడం చేతి వాటం చైనామన్ బౌలర్లపై కోహ్లీ 71 సగటు, 105 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. గత రెండేళ్లలో ఈ సగటు మరింత పెరిగింది. లెగ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో అతను ఈ రెండేళ్లలో కేవలం ఒక్కసారి మాత్రమే అవుటయ్యాడు. కాబట్టి కోహ్లీని ఇబ్బంది పెట్టాలని అనుకుంటే.. పాక్ జట్టు షాదాబ్ ఖాన్‌ను అతనికి దూరంగా ఉంచాలి.

ముఖ్యంగా కోహ్లీ క్రీజులోకి వచ్చిన సమయంలో షాదాబ్‌తో బౌలింగ్ వేయించకూడదు. ఎందుకంటీ దీని వల్ల కోహ్లీ క్రీజులో కుదురుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు వన్డేలు, టీ20ల్లో రెండేసిసార్లు కోహ్లీని షాదాబ్ ఎదుర్కొన్నాడు. కానీ ఒక్కసారి కూడా అతన్ని అవుట్ చేయలేకపోయాడు. అంతేకాదు కోహ్లీ భారీగా పరుగులు పిండుకున్నాడు కూడా. మంచి ఆరంభం లభిస్తే భారీ స్కోర్లు చేయడం కోహ్లీకి అలవాటు. కాబట్టి పాక్ ఈ ప్లాన్ వేసింది.

అఫ్రిదీ ఎటాక్..
కోహ్లీని అడ్డుకోవడానికి పాక్ వద్ద ఉన్న ఏకైక ఆయుధం షహీన్ అఫ్రిదీ. వీళ్లిద్దరి మధ్య పోరే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయిస్తుందని చాలా మంది అభిప్రాయం కూడా. ఎడం చేతి వాటం పేసర్ల బౌలింగ్‌లో కోహ్లీ తన కెరీర్‌లో చాలాసార్లు తడబడ్డాడు. ముఖ్యంగా 2022 తర్వాత ఈ తడబాటు మరింత ఎక్కువైంది. ఈ పేసర్లపై కోహ్లీ సగటు కేవలం 21.25 మాత్రమే.

India vs Pakistan

అదే పాక్ నుంచి వచ్చిన వాహబ్ రియాజ్, జునైద్ ఖాన్, మహమ్మద్ ఆమిర్, షహీన్ అఫ్రిదీ బౌలింగ్‌లో అయితే కోహ్లీ ఇంకా ఇబ్బది పడ్డాడు. పాక్‌పై కోహ్లీ అవుటైన సందర్భాల్లో సగం లెఫ్ట్ ఆర్మ్ పేసర్ల బౌలింగ్‌లోనే కావడం గమనార్హం. అయితే కేవలం బౌలింగ్ మీదనే ఆధారపడకుండా.. కోహ్లీకి అఫ్రిదీ బౌలింగ్ చేసిన ప్రతిసారీ బాబర్ మంచి ఎటాకింగ్ ఫీల్డ్ పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే కోహ్లీని పాక్ అడ్డుకోగలదని నిపుణుల అభిప్రాయం.

Story first published: Saturday, September 9, 2023, 18:56 [IST]
Other articles published on Sep 9, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+