కోహ్లీ నుంచి ఎంతో నేర్చుకున్నా- టెక్నిక్స్ ఉపయోపడ్డాయి: బాబర్ ఆజమ్
ఇస్లామాబాద్: ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ అదరగొట్టింది. పసికూన నేపాల్‌పై విజృంభించింది. ఏకంగా 238 పరుగుల తేడాతో మట్టికరిపించింది. సెంచరీతో అదరగొట్టిన కేప్టెన్ బాబర్ ఆజమ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ను అందుకున్నాడు. ఈ విజయంతో భారత్‌ను ఎదుర్కొనడానికి పాకిస్తాన్ సమాయాత్తమౌతోంది.
ముల్తాన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. బాబర్ ఆజమ్- 151, ఇఫ్తికర్ అహ్మద్- 109 పరుగులు చేశారు. వారిద్దరు చెలరేగడంతో భారీ స్కోరును సాధించింది పాకిస్తాన్.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నేపాల్.. పాకిస్తాన్ బౌలర్ల ధాటికి ఎదురు నిలవలేకపోయింది. 23.4 ఓవర్లల్లో 104 పరుగులకే కుప్పకూలింది. మిడిలార్డర్ బ్యాటర్ సోమ్‌పాల్ కమీ చేసిన 28 పరుగులే నేపాల్ బ్యాటింగ్ ఆర్డర్‌లో టాప్ స్కోర్. ఆరిఫ్ షేక్- 26, గుల్షన్ ఝా- 13 మాత్రమే డబుల్ డిజిట్‌ను అందుకోగలిగారు.
తన ఫామ్‌పై స్పందించాడు బాబర్ ఆజమ్. టీమిండియా బ్యాటింగ్ మిషన్ విరాట్ కోహ్లీని ఆకాశానికెత్తేశాడు. కోహ్లీ నుంచి అనేక నేర్చుకున్నానని చెప్పాడు. కోహ్లి లాంటి పెద్ద వరల్డ్ క్లాస్ ప్లేయర్.. తన గురించి కొన్ని సందర్భాల్లో సానుకూలంగా స్పందించారని, అది తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని పేర్కొన్నాడు.
2019లో తాను తొలిసారిగా కోహ్లీని కలిశానని, అప్పుడతని కేరీర్ ఏ అత్యున్నతస్థాయిలో ఉందో.. నాలుగేళ్ల తరువాతా అలాగే ఉందని, ఇదో అద్భుతమని వ్యాఖ్యానించాడు. ఇన్ని సంవత్సరాలపాటు నిలకడగా రాణించడం అసాధ్యమని, ఎలాంటి ఆటగాడికైనా కష్టమని బాబర్ ఆజమ్ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్‌పై తనకు ఉన్న కొన్ని సందేహాలు, టెక్నిక్స్ గురించి అడగ్గా ఓపిగ్గా బదులిచ్చాడని, అది తన కేరీర్‌కు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications