Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2023 హాట్‌స్టార్ బంపరాఫర్.. ఆసియా కప్, వరల్డ్ కప్ ఫ్రీగా చూసే ఛాన్స్!

భారత్‌తో క్రికెట్ అంటే ఎంత పిచ్చి ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు క్రికెట్ టోర్నీల బ్రాడ్‌కాస్టింగ్, స్ట్రీమింగ్ హక్కులను వేల కోట్లు పోసి కొంటాయి కంపెనీలు. ఇటీవల ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులు రూ.42 వేల కోట్లకు అమ్ముడుపోయాయంటేనే ఇది ఎంత పెద్ద డీల్ అని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఐపీఎల్ సమయంలో ప్రముఖ స్టీమ్రింగ్ సంస్థ హాట్‌స్టార్‌కు పెద్ద దెబ్బ తగిలింది.

ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసిన జియో సినిమా.. ఉచితంగానే అందరూ ఐపీఎల్ చూసే అవకాశం కల్పించింది. దీంతో చాలా మంది హాట్‌స్టార్ మెంబర్‌షిప్ వదిలేసుకున్నారు. దీంతో ఈ యాప్ యూజర్ల సంఖ్య చాలా పడిపోయింది. ఈ క్రమంలో ఐపీఎల్ సమయంలో కోల్పోయిన యూజర్లను తిరిగి సంపాదించుకునేందుకు హాట్‌స్టార్ పెద్ద ప్లానే వేసింది.

Asia Cup 2023 Hotstar will stream ODI World Cup and Asia cup for free

ప్రస్తుతం జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ చూడాలన్నా కూడా మొబైల్ యూజర్లు హాట్‌స్టార్‌లోనే ఎక్కువగా చూస్తున్నారు. ఇది గమనించిన హాట్‌స్టార్ ఈ ఏడాది చివర్లో జరిగే రెండు ప్రధాన టోర్నీలపై కన్నేసింది. అవే ఆసియా కప్ 2023, ఐసీసీ వన్డే వరల్డ్ కప్. ఈ ఏడాది సెప్టెంబరులో ఆసియా కప్ జరుగుతుంది. అయితే ఈ టోర్నీ వేదికపై వివాదం నేపథ్యంలో ఇంకా ఆసియా కప్ షెడ్యూల్ విడుదల కాలేదు.

ఇక ఆసియా కప్ ముగిసిన తర్వాత అక్టోబరు, నవంబరు నెలల్లో వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. ఈ రెండు కీలక క్రికెట్ టోర్నీలను తమ యూజర్లు ఫ్రీగా చూడొచ్చని హాట్‌స్టార్ ప్రకటించింది. అయితే కేవలం మొబైల్ యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ ఇచ్చింది. టీవీ, ల్యాప్‌ట్యాప్స్‌లో చూడాలంటే మాత్రం సబ్‌స్క్రిప్షన్ ప్యాక్‌లు తీసుకోవాల్సిందేనట.

ఏదేమైనా ఈ వార్త విన్న అభిమానులు మాత్రం తెగ సంతోషిస్తున్నారు. ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ రెండింట్లోనూ భారత్, పాక్ మ్యాచులకు వ్యూయర్‌షిప్ రికార్డులు బద్దలవుతాయని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమయంలో ప్రేక్షకుల ఆశలను క్యాష్ చేసుకోకుండా, వారి నమ్మకాన్ని పొందడానికే హాట్‌స్టార్ ఈ ప్లాన్ వేసినట్లు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Story first published: Friday, June 9, 2023, 13:10 [IST]
Other articles published on Jun 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+