Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2023: పాక్‌తో మ్యాచ్ ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్.. రేసు గుర్రం తిరిగొచ్చేశాడు!

ఆసియా కప్‌లో భారత జట్టు మరో కీలక మ్యాచ్‌కు రెడీ అవుతోంది. గ్రూప్ దశలో పాకిస్తాన్‌తో భారత్ ఆడిన మ్యాచ్ వర్షం వల్ల మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పసికూన నేపాల్‌ను భారత్ ఢీకొట్టింది. ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. పాక్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత బుమ్రా భార్య డెలివరీ టైం దగ్గరపడింది. దీంతో ముఖ్యమైన సమయంలో భార్య పక్కనే ఉండాలని బుమ్రా డిసైడ్ అయ్యాడు.

అందుకే నేపాల్ మ్యాచ్‌ ఆడకుండా ముంబై వచ్చేశాడు. అతను వచ్చిన మరుసటి రోజే బుమ్రా భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబుకు అంగద్ అని పేరు పెట్టినట్లు బుమ్రా తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించాడు. ఆ తర్వాత ఒక రోజు కుటుంబంతో గడిపిన బుమ్రా.. మళ్లీ శ్రీలంక చేరుకున్నాడట. సూపర్-4 దశలో మరోసారి పాకిస్తాన్‌తో తలపడేందుకు భారత్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

Asia Cup 2023

ఈ మ్యాచ్‌లో భారత బౌలింగ్ విభాగంలో బుమ్రా చాలా కీలకం కానున్నాడు. బుమ్రా ఇప్పటి వరకు ఆసియా కప్‌లో బౌలింగ్ చేయలేదన్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక నేపాల్‌తో మ్యాచ్‌ సమయంలో టీంలో బుమ్రా లేడు. దీంతో పాక్‌తో జరిగే మ్యాచ్‌లో బుమ్రా ఎలా బౌలింగ్ చేస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Asia Cup 2023

బుమ్రా కెరీర్‌లో పాక్‌పైనే చెత్త రికార్డు ఉంది. పాక్‌పై అతను ఆరు వన్డేలు ఆడాడు. వీటిలో కేవలం 4 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. దాయాదులపై అతని బౌలింగ్ సగటు, స్ట్రైక్ రేటు కూడా దారుణంగా ఉన్నాయి. ఈ క్రమంలో పాక్‌తో మ్యాచ్‌లో బుమ్రా ఎలా రాణిస్తాడనేది ఆసక్తిగా మారింది. ఇక ఈ మ్యాచ్ జరిగే కొలంబోలో భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే భారత్, పాక్ మ్యాచ్ కోసం రిజర్వ్ డే కూడా ఉంచుతున్నట్లు ఏసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Story first published: Friday, September 8, 2023, 16:12 [IST]
Other articles published on Sep 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+